LSG vs CSK: లక్నోకు భారీ షాక్‌.. చావోరేవో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సంచలన విజయం

Chennai Super Kings Beat Lucknow Super Giants By 5 Wickets: వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారీ ఊరట లభించింది. ఐదు ఓటముల అనంతరం తొలి విజయం లభించింది. లక్నో సూపర్‌ జియాంట్స్‌పై ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 15, 2025, 01:02 AM IST
LSG vs CSK: లక్నోకు భారీ షాక్‌.. చావోరేవో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సంచలన విజయం

IPL 2025 LSG vs CSK: నరాలు తెగే ఉత్కంఠ.. విజయమా.. ఓటమా? అని చావోరేవో అనే రీతిలో సాగిన పోరాటంలో ఎట్టకేలకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సంచలన విజయం పొందింది. ఐదు మ్యాచ్‌ల్లో ఘోర ఓటములు ఎదుర్కొన్న చైన్నె జట్టు టోర్నీలో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన చేసింది. లక్నో సూపర్‌ కింగ్స్‌ను ఓడించి అత్యంత కీలక మ్యాచ్‌ను సొంతం చేసుకుని ఇంకా ట్రోఫీ బరిలో ఉన్నామని నిరూపించింది. ఎక్నా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జియాంట్స్‌ను 5 వికెట్ల తేడాతో పడగొట్టి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

Add Zee News as a Preferred Source

Also Read: DC vs MI Live: ఢిల్లీ జైత్రయాత్రకు బ్రేక్.. ముంబై ఇండియన్స్‌పై పోరాడి ఓడిన క్యాపిటల్స్

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌ జియాంట్స్‌ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులకు పరిమితమైంది. మర్‌క్రమ్‌ (6), నికోలస్‌ పూరన్‌ (8) అతి తక్కువ స్కోర్‌కే ఔటవగా.. మిచెల్‌ మార్ష్‌ 30 పరుగులతో పర్వాలేదనిపించాడు. బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్‌ పంత్‌ కష్ట సమయంలో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 49 బంతుల్లో 63 పరుగులు చేయగా.. 4 ఫోర్లు, సిక్సర్లు బాదాడు. అనంతరం వచ్చిన ఆయుశ్‌ బదౌనీ (22), అబ్దుల్‌ సమంత్‌ (20), శార్దూల్‌ ఠాకూర్‌ (6) తలా కొన్ని పరుగులు చేశారు. చెన్నై బౌలర్ల ధాటికి పరుగులు తీసేందుకు లక్నో బ్యాటర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 

Also Read: RCB vs RR: బ్యాట్‌తో విరాట్ కోహ్లీ వీర విహారం.. రాజస్థాన్‌పై బెంగళూరుకు భారీ విజయం

కచ్చితంగా గెలిచి నిలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై అద్భుతంగా బౌలింగ్‌ వేసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. భారీ స్కోర్‌ రాకుండా చక్కగా నియంత్రిస్తూ బౌలింగ్‌ వేశారు. రవీంద్ర జడేజా, మతీష పతిరణ రెండు చొప్పున వికెట్లు తీశారు. ఖలీల్‌ అహ్మద్‌, అన్షుల్‌ కంబోజు ఒక్కో వికెట్‌ పడగొట్టారు. కీలకమైన మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్‌ వేసి స్కోర్‌ను బాగా నియంత్రించారు.

వరుస ఓటములతో సతమతవుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ 5 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లకు 165 లక్ష్యం పూర్తి చేసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సమష్టి ప్రదర్శన కనబర్చింది. బౌలర్లు అతి తక్కువ స్కోర్‌కు పరిమితం చేయగా.. ఆ లక్ష్యాన్ని కొంత పోరాడి చెన్నై సాధించింది. షేక్‌ రషీద్‌ (27), రచిన్‌ రవీంద్ర (37) పర్వాలేదనిపించగా.. రాహుల్‌ త్రిపాఠి (9), రవీంద్ర జడేజా (7) తక్కువ పరుగులకే ఔటయ్యారు. శివమ్‌ దూబే 37 బంతుల్లో చేసిన 43 పరుగులు అత్యధిక స్కోర్‌ కావడం గమనార్హం. విజయ్‌ శంకర్‌ 9 పరుగులకు ఔటయిన క్లిష్ట పరిస్థితుల్లో బెస్ట్‌ ఫినిషర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ గ్రౌండ్‌లోకి దిగి మ్యాచ్‌ను పూర్తి చేశాడు. 11 బంతుల్లో 26 పరుగులు చేసి జట్టుకు కీలక విజయాన్ని అందించి ఊపిరి పోశాడు. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ర్యాంకు మెరుగైంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదింట ఓడి రెండింట్లో సీఎస్కే విజయం సాధించింది. ఏడు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి మూడు ఓటములతో జట్టు ప్లేఆఫ్స్‌ దశలో ముందంజలో ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News