LSG Beat KKR By 4 Runs: సొంత గడ్డపై డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సమష్టి కృషి చేసినా కూడా ఆఖరి ఓవర్ వరకు పోరాడినా కూడా ఫలితం నిరాశపర్చింది. సొంత గడ్డపై లక్నో సూపర్ జియాంట్స్ చేతిలో కేకేఆర్‌కు పరాజయం ఎదురైంది. అత్యంత ఉత్కంఠ రేపిన కీలక మ్యాచ్‌లో కోల్‌కత్తాపై 4 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించి తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ మెరుపులకు అదే స్థాయిలో ప్రత్యర్థి జట్టు ఆడినా కూడా మ్యాచ్‌ను సొంతం చేసుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లకు లక్నో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేయగా.. 7 వికెట్లు కోల్పోయి 234 పరుగుల వద్ద కోల్‌కత్తా పోరాటం ముగించింది.
Also Read: RCB vs MI: ఐపీఎల్ 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జోరు.. ముంబై ఇండియన్స్ చిత్తు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జియాంట్స్ భారీ పరుగులు రాబట్టింది. ఐడెన్ మార్‌క్రమ్ 47 పరుగులతో సత్తా చాటగా.. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ ఇద్దరూ జత కట్టి సునామీ సృష్టించారు. 48 బంతుల్లో 81 పరుగుల (6 ఫోర్లు, 5 సిక్సర్లు)తో మిచెల్ విరుచుకుపడగా.. పూరన్ 36 బంతుల్లోనే అత్యంత వేగంగా 87 పరుగులు చేశాడు. 8 సిక్సర్లు, 7 ఫోర్లతో చెలరేగి నాటౌట్‌గా ఆడి ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించాడు. అబ్దుల్ సమద్ (6), డేవిడ్ మిల్లర్ (4*) కొన్ని పరుగులు చేశారు. కోల్‌కత్తా బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. పరుగులను నియంత్రించలేకపోగా.. వికెట్లు తీయడంలో కూడా తడబడ్డారు. హర్షిత్ రానా రెండు వికెట్లు తీయగా.. ఆండ్రె రస్సెల్ ఒకటి పడగొట్టాడు.
Also Read: IPL 2025 SRH vs GT: సన్‌రైజర్స్ ఐపీఎల్ 2025 ట్రోఫీ చేజారినట్టే! గుజరాత్ చేతిలో భారీ ఓటమి
బౌలర్లు విఫలమైన వేళ కోల్‌కత్తా బ్యాటర్లు విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. ఆఖరి బంతి వరకు పోరాడి 7 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసి సొంత గడ్డపై చేదు ఫలితాన్ని ఎదుర్కొన్నారు. క్వింటన్ డికాక్ (15), రమణ్‌దీప్ సింగ్ (1), రఘువంశీ (5), రస్సెల్ (7) తక్కువ పరుగులు నమోదు చేశారు. సునీల్ నరైన్ దూకుడుగా ఆడి 30 పరుగులు చేయగా.. కెప్టెన్ అంజిక్యా రహనే అదరగొట్టాడు. 35 బంతుల్లో 61 పరుగులు (8 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వెంకటేశ్ అయ్యర్ దూకుడుగా ఆడి 45 పరుగులు చేశాడు. ఆఖరులో రింకూ సింగ్ ప్రత్యర్థిని బెంబెలెత్తించేలా బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను విజయానికి చేరువ చేశాడు. 15 బంతుల్లో 38 పరుగులు చేసి సత్తా చాటగా.. హర్షిత్ రానా 10 పరుగులు చేశాడు. మొదట్లో తడబడినా తర్వాత లక్నో బౌలర్లు రెచ్చిపోయారు. పరుగులను నియంత్రించలేకపోయినా వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీశారు. ఆకాశ్ దీప్, శార్దూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ సింగ్, రవి బిష్ణోయ్ ఒక్కో వికెట్ తీశారు.
భారీ నష్టం..
భారీ విజయం సాధించాల్ని లక్నో సూపర్ జియాంట్స్ కొన్ని తప్పిదాలతో అతి కష్టంగా విజయం సాధించింది. కొన్ని ఫీల్డింగ్ తప్పిదాలు దొర్లగా శార్దూల్ ఠాకూర్ భారీ దెబ్బతీశాడు. ఎక్స్‌ట్రా పరుగులు ఇచ్చి మ్యాచ్‌ను కష్టంగా చేశాడు. 13వ ఓవర్‌కు వచ్చిన శార్దూల్ ఠాకూర్ వరుసగా ఐదు వైడ్లు వేసి అందరికీ చిరాకు తెప్పించాడు. ఈ ఒక్క ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. ఐదు వైడ్లతోపాటు 1,1,0,4,2 వచ్చాయి. మ్యాచ్ ప్రతికూలంగా మారితే మాత్రం ఓటమికి ప్రధాన కారణం శార్దూల్ అయ్యేవాడు. ఈ ఐదు వైడ్లతో ఐపీఎల్‌లో రెండో చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతకుముందు మహ్మద్ సిరాజ్ ఉన్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









