Mohammad Siraj: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కకపోవడంపై స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ మొదటిసారి స్పందించాడు. జట్టులో చోటు దక్కలేదని తెలిసి ఎంతో బాధపడినట్లు తెలిపాడు. అది జీర్ణించుకోవడం చాలా కష్టమైందన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, మేనేజ్ మెంట్ జట్టుకు ఏది మంచిదో అదే ఆలోచిస్తారని తెలిపాడు. మంగళవారం గుజరాత్, పంజాబ్ మ్యాచ్ కు ముందు మహ్మద్ సిరాజ్ ఈ కామెంట్స్ చేశాడు.
ఇంటర్నేషనల్ ప్లేయర్లు అన్ని ఐసీసీ టోర్నమెంట్ ల్లో ఆడాలని అనుకుంటారు. నేను కూడా ఆవిధంగానే అనుకుంటా. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేదని తెలిసి చాలా బాధపడ్డాను. అది జీర్ణించుకోవడం నా వల్ల కాలేదు. కానీ రోహిత్ భాయ్ జట్టుకు ఏది మంచిదో అదే చేస్తాడు. అతడికి చాలా అనుభవం ఉంది. దుబాచ్ పిచ్ లపై పేసర్ల ప్రభావం తక్కువగా ఉంటుందని అతనికి తెలుసు. అందుకే కెప్టెన్ గా స్పిన్నర్లకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చాడు. ఏదైతేనేం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాము. అది సంతోషంగా ఉందని సిరాజ్ అన్నాడు.
Also Read: IPL 2025: దెబ్బ గట్టిగా పడింది.. స్పిన్ ఉచ్చులో రాజస్థాన్ విలవిల
ఛాంపియన్స్ ట్రోఫీ ఐఫీఎల్ మధ్యలో బ్రేక్ తనకు ప్రాక్టీస్ చేసుకునేందుకు ఉపయోగపడిందన్నారు. కొంతకాలంగా నేను బ్రేక్ లేకుండా క్రికెట్ ఆడుతున్నాను. అయితే మ్యాచుల్లో ఆడుతున్నప్పుడు తన తప్పులను తెలుసుకోలేము. అందుకే ఈ బ్రేక్ ను వాడుకున్నాను . ఫిట్‌నెస్, ప్రాక్టీస్ పై దృష్టి పెట్టాను అని పేర్కొన్నాడు. అయితే భారత్ తమ మ్యాచులు ఆడే దుబాయ్ పిచ్ లు స్పిన్నర్లకు అనుకూలమని మేనేజ్ మెంట్ భావించింది. అందుకే ఈ టోర్నీకి జట్టులో ఐదుగురు స్పిన్నర్లకు చోటు దక్కింది. దీంతో సిరాజ్ ను పక్కన పెట్టాల్సి వచ్చింది. రోహిత్ అప్పుడే నాకు క్లారిటీ ఇచ్చాడు. 2023 వన్డే, 2024 టీ 20 వరల్డ్ కప్ టోర్నీల్లో మాత్రం సిరాజ్ కు అవకాశం దక్కింది.
Mohammad Siraj said, "Rohit Sharma always does what is best for the team. He knew that fast bowlers won't be used much in Dubai, so he picked spinners in the squad and won the Champions Trophy". pic.twitter.com/9hahxjPunQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 26, 2025
Also Read: IPL 2025: నువ్వు నిజంగా లెజెండ్ బ్రో.. ఏకంగా బుమ్రా రికార్డు బ్రేక్ చేసిన రషీద్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









