)
Most Golden Ducks In IPL History: ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆడిన తొలి బంతికే కోహ్లీ పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో రాజ్ బవా క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో విరాట్ కోహ్లీ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ఐపీఎల్ చరిత్రలో కోహ్లీకి ఇది 12 డకౌట్ కాగా.. 8వ గోల్డెన్ డకౌట్ కావడం గమనార్హం. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు గోల్డెన్ డకౌట్ అయిన జాబితాలో కోహ్లీ మూడవ స్థానంలో నిలిచాడు.
ఇక ఈ జాబితాలో రషీద్ ఖాన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అతడు 12 సార్లు గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తరువాత గ్లెన్ మాక్స్వెల్ ఉన్నాడు. అతడు 10 సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు గోల్డెన్ డకౌట్లు అయిన బ్యాటర్లు వీరే..
1. రషీద్ ఖాన్ – 12 సార్లు
2. గ్లెన్ మాక్స్వెల్ – 10 సార్లు
3. విరాట్ కోహ్లీ – 8 సార్లు
4. ఇషాన్ కిషన్ – 8 సార్లు
5. సునీల్ నరైన్ – 8 సార్లు
అయితే 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్లు కావడం ఇది రెండో సారి మాత్రమే. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ కోహ్లీ రెండు బంతులకు డకౌట్ అయ్యాడు. అంతకముందు 2022 ఐపీఎల్ సీజన్లో లక్నో, సన్ రైజర్స్ పై వరుస మ్యాచ్‌ల్లో కోహ్లీ డకౌట్లు అయ్యాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి