Team India Facts: దుబాయ్ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ పోరులో కివీస్ జట్టును మట్టి కరిపించి ఛాంపియన్స్ ట్రోఫీను మూడోసారి ముద్దాడింది టీమ్ ఇండియా. లీగ్ దశ నుంచి నాకౌట్ వరకు ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా కప్ గెల్చుకుంది. 25 ఏళ్ల నాటి పగకు ప్రతీకారం తీర్చుకున్న టీమ్ ఇండియాను నిశితంగా గమనిస్తే ఓ అరుదైన ఫీట్ సాధించిందని చెప్పాలి.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చేజిక్కించుకున్న టీమ్ ఇండియాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వయసు మళ్లింది..ఇక రిటైర్మెంట్ అవసరమనే ట్రోలింగ్‌కు చెక్ చెప్పడమే కాకుండా ఆ సీనియర్లే మ్యాచ్‌ను గెలిపించారు. టోర్నీ మొత్తం బౌలర్లతో ఆధిపత్యంగా సాగింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఫామ్‌లో రావడమే కాకుండా ముగ్గురూ మూడు నాలుగు సందర్భాల్లో జట్టును ఆదుకున్నారు. ఎంతైనా సీనియార్టీ పనిచేస్తుందని రుజువు చేశారు. అందరి నోళ్లకు మూతలు వేశారు. ఇదంతా ఓ ఎత్తైతే టోర్నీలో ఏ ఇతర జట్టుకు లేని ప్రత్యేకత టీమ్ ఇండియాలో ఉంది. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కైవసం చేసుకున్న టీమ్ ఇండియాలో కొన్ని ప్రత్యేకతలున్నాయి. టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లో 10 మంది ఆటగాళ్ల వయస్సు 30 ఏళ్లు దాటి ఉంది. ఐసీసీ టోర్నమెంట్ గెలిచిన ఓల్డ్ టీమ్‌గా భారత జట్టు నిలిచిందని చెప్పవచ్చు. ఎందుకంటే మరే ఇతర జట్టులోనూ ఇంతమంది 30 ఏళ్ల వయస్సు దాటినవాళ్లు లేరు. టీమ్ ఇండియా తరపున ఆడిన ప్లేయింగ్ 11లో పది మంది వయస్సు మూడు పదులు దాటి ఉండటం విశేషం. ఒక్క శుభమన్ గిల్ ఒక్కడే 27 ఏళ్ల వయస్సు కలిగినవాడు. మరో 23 ఏళ్ల హర్షిత్ రాణా ఉన్నాడు కానీ మొదటి మ్యాచ్ తరువాత అతను 33 ఏళ్ల వరుణ్ చక్రవర్తితో రీప్లేస్ అయ్యాడు. ఇక ఈ టోర్నీకు ఎంపికై ఒక్క మ్యాచ్ ఆడని 30 ఏళ్ల వయస్సులోబడి ఉన్నవారిలో రిషభ్ పంత్ , అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. వీరిలో రిషభ్ పంత్ వయస్సు 27 , అర్షదీప్ సింగ్ 26 ఏళ్లు కాగా, వాషింగ్టన్ సుందర్ వయస్సు 25 ఏళ్లు. కానీ ఈ ముగ్గురు ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ ఆడలేదు.
30 ఏళ్లు దాటిన టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ సభ్యులు
రోహిత్ శర్మ 37
విరాట్ కోహ్లీ 36
రవీంద్ర జడేజా 36
మోహమ్మద్ షమి 34
వరుణ్ చక్రవర్తి 33
కేఎల్ రాహుల్ 32
హార్దిక్ పాండ్యా 31
అక్షర్ పటేల్ 31
కుల్దీప్ యాదవ్ 30
శ్రేయస్ అయ్యర్ 30
ప్లేయింగ్ 11లో ఏకంగా 10 మంది 30 ఏళ్ల వయస్సు దాటినవాళ్లు కావడం గమనార్హం. 30 ఏళ్లు దాటిన ఇంతమంది కలిగిన జట్టు ఐసీసీ టోర్నీ గెలవడం కూడా ఇదే తొలిసారి కావచ్చు. వయస్సు చెప్పుకోడానికే కానీ ఆటకు కాదని నిరూపించారు. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెల్చుకుని ఛాంపియన్స్ అయ్యారు. మూడు పదుల వయస్సు దాటినా వాడి తగ్గలేదని నిరూపించారు.
Also read: Team India Schedule: టీమ్ ఇండియా నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి, ఇంగ్లండ్ సిరీస్ తరువాత రెస్ట్ ఉందా లేదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









