)
Ravindra Jadeja Most Sixes: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో భారత జట్టు తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో MS ధోనిని అధిగమించాడు. వెస్టిండీస్‌తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో.. నాలుగో సిక్సర్ కొట్టిన తర్వాత రవీంద్ర జడేజా ఈ ఘనత అందుకున్నాడు.
MS ధోని 90 టెస్టుల్లో 144 ఇన్నింగ్స్‌ల్లో 78 సిక్సర్లు కొట్టగా.. జడేజా 86 మ్యాచ్‌ల్లో 129 ఇన్నింగ్స్‌ల్లో 79 సిక్సర్లు బాదాడు. టెస్టుల్లో భారత్ తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు రిషబ్ పంత్, సెహ్వాగ్ ల పేరిట ఉంది. పంత్ 47 మ్యాచ్‌ల్లో 82 ఇన్నింగ్స్‌ల్లో 90 సిక్సర్లు కొట్టాడు. సెహ్వాగ్ 103 మ్యాచ్‌ల్లో 90 సిక్సర్లు బాదాడు. ఆ తరువాత రోహిత్ శర్మ మాత్రమే జడేజా కన్నా ముందు ఉన్నాడు.
టెస్టుల్లో భారత్ తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు ఎవరంటే..
1. రిషబ్ పంత్ – 47 మ్యాచ్‌ల్లో 90 సిక్సర్లు
2. వీరేంద్ర సెహ్వాగ్ – 103 మ్యాచ్‌ల్లో 90 సిక్సర్లు
3. రోహిత్ శర్మ – 67 మ్యాచ్‌ల్లో 88 సిక్సర్లు
4. రవీంద్ర జడేజా – 86 మ్యాచ్‌ల్లో 79 సిక్సర్లు
5. మహేంద్ర సింగ్ ధోని – 90 మ్యాచ్‌ల్లో 78 సిక్సర్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌ల్లో 162 పరుగులకు ఆలౌటైంది. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు టీ విరామ సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ (68 నాటౌట్), రవీంద్ర జడేజా (50) క్రీజులో ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook