)
MS Dhoni Funny Video: తన తోటి క్రికెటర్లను ఆటపట్టిస్తూ అప్పుడప్పుడూ జోవియల్ గా కనిపించే ధోనీ.. తన ఫ్యామిలీకీ తగిన సమయం ఇస్తూ వారితోనూ అంతే సరదాగా ఉంటాడు. అయితే, తాజాగా.. ధోనీ ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న వీడియో వైరల్ అవుతుంది. ఆ సమయంలో వధువు, వరుడిని ఉద్దేశించి ధోనీ చేసిన వ్యాఖ్యలు.. అక్కడున్న అందరికీ నవ్వులు తెప్పించాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. నువ్వు మామూలోడివి కాదు ధోనీ భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా ఓ పెళ్లికి వెళ్లాడు ధోనీ. ఆ వేడుకలో న్యూ కపుల్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. వారికి పలు సలహాలు, సూచనలు చేశాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు. ధోనీ ఏం మాట్లాడంటే.. కొంత మంది నిప్పుతో చెలగాటమాడాలని అనుకుంటారు.. వారిలో ఈపెళ్లి కొడుకు ఒకరు. అయితే నాకు కూడా ఈ విషయంలో మినహాయింపు ఉందని అనుకోకండి.. నా వైఫ్ కూడా అంతే. ఇక ఇక్కడ ఉన్న భర్తల అందరి పరిస్థితి కూడా ఇంతే. నువ్వు వరల్డ్ కప్ గెలిచావా..?లేదా..? అనేది ఇక్కడ అసలు విషయం కాదంటూ ధోని అనడంతో.. అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుల జల్లులు కురిపించారు. ఆ తరువాత ధోనీ వధువుకు ఓ సూచన చేశాడు. మీ హస్బెండ్ కోపంగా ఉన్నప్పుడు మీరు ఏమీ అనకండి.. ఎందుకంటే భర్తల కోపం ఐదు నిమిషాల్లో చల్లారిపోతుందన్నాడు.
ఇక ఇప్పుడు పెళ్లిపై ధోనీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ధోనీ భయ్యా నువ్వు కూడా మాలో ఒకడివా.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
Captain cool turning into Husband School 😭❤️ pic.twitter.com/tt7nD0I9Uf
— Professor Sahab (@ProfesorSahab) November 27, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి