)
MS Dhoni Last IPL Season: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రతి సీజన్ ప్రారంభమయ్యే ప్రతిసారి.. ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్ అంటూ అనేకసార్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కరోనా సంక్షోభం నుంచి అంటే 2020 నుంచి ధోనీ ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు అంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఆయన గత ఐదేళ్లుగా ఐపీఎల్ ఆడుతూనే వచ్చాడు. కానీ, 2026 ఐపీఎల్ సీజన్ మాత్రం తలా ధోనికి చివరిదని అంటున్నారు. అయితే ఇది పుకారు మాత్రం కాదు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన ఓ వ్యక్తి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే అతని పేరు మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇదే క్రమంలో ధోనిని ఈ సీజన్ ను రిటైన్ చేసుకున్నా.. కొత్తగా సంజూ శాంసన్‌ను రాజస్థాన్ జట్టు నుంచి సీఎస్కే తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజూ కొత్త కెప్టెన్ అవుతాడనే వార్తలు వస్తున్న వేళ.. ధోనికి ఇదే చివరి సీజన్ అంటూ తెగ న్యూస్ వైరల్ అవుతుంది. ధోనితో పాటు మరికొందరు క్రికెటర్లకు ఇదే చివరి సీజన్ అంటూ చెబుతున్నారు. ఈ సీజన్ తర్వాత ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ తప్పనిసరి అంటూ వాదన వినిపిస్తుంది.
సంజు రాక ధోని రిటైర్మెంట్ ఖరారు అయినట్టేనా?
ధోని 2026 ఐపీఎల్లో ఆడతాడని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ధృవీకరించారు. అయితే ఇదే తన చివరి ఐపీఎల్ సీజన్ అంటూ బలమైన సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ధోని మోకాలి నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ సామ్సన్ CSKకి మారడం చాలా కీలకంగా పరిగణిస్తున్నారు. వికెట్ కీపర్ స్థానంతో పాటు కెప్టెన్సీ నిర్వహించుకునేందుకు సంజూ పనికొస్తాడని సీఎస్కే మేనేజ్మెంట్ భావించినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ధోనికి ప్రత్యామ్నాయంగా సంజూ శాంసన్ మారబోతున్నాడని బలమైన సంకేతం సీఎస్కే యాజమాన్యం నుంచి వినిపిస్తుంది.
ధోనితో పాటు ఐపీఎల్ రిటైర్మెంట్ ఇచ్చే ఆటగాళ్లు ఎవరు?
ధోని కాకుండా, మరో ఇద్దరు సీనియర్ భారత ఆటగాళ్లకు ఇది చివరి ఐపీఎల్ సిరీస్ అయ్యే అవకాశం ఉంది.
ఇషాంత్ శర్మ: గుజరాత్ టైటాన్స్ జట్టులో అట్టిపెట్టుకున్న ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ గత కొన్నేళ్లుగా మంచి ఫామ్‌లో లేడు. 2025 సీజన్లో అతను 7 మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో పాటు అతని ఎకానమీ రేటు 11.80గా ఉంది. ఫిట్నెస్, వయస్సు కారణంగా ఇషాంత్ శర్మ 2026 సీజన్ తర్వాత రిటైర్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.
అజింక్య రహానే: గతేడాది ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు నాయకత్వం వహించిన రహానే.. బ్యాటింగ్‌తో కొంతవరకు బాగా రాణించినప్పటికీ (12 మ్యాచ్‌ల్లో 390 పరుగులు) జట్టును విజయపథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. దీంతో గత సీజన్లో KKR ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయినా కొందరి సన్నిహితుల సమాచారం ద్వారా రహానే కూడా వచ్చే సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.
రోహిత్ శర్మ: ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన రోహిత్ శర్మ ఇప్పుడు ఐపీఎల్‌కు వీడ్కోలు చెప్పనున్నారని సమాచారం. ఈ టోర్నీకి రిటైర్మెంట్ చెప్పి.. పూర్తిగా వన్డేలపై దృష్టి పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా రాబోయే వన్డే ప్రపంచకప్ టార్గెట్ పెట్టుకున్నట్లు అంటున్నారు.
IPL 2026 ఎప్పుడు?
బీసీసీఐ అధికారికంగా తేదీని ప్రకటించనప్పటికీ.. ఐపీఎల్ 2026 మార్చి నెలాఖరు నాటికి యథావిధిగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది ధోని చివరి 'హెలికాప్టర్ షాట్' సీజన్ అయితే, అభిమానులకు ఇది ఒక ఎమోషనల్ న్యూస్ అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook