Mumbai Indians Won: ఓటమి ఎరుగకుండా అద్భుత విజయాలతో అగ్రస్థానంలో దూసుకెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుతమే చేసింది. ఫుల్ జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి ఓటమిని రుచిచూపించింది. అత్యంత ఉత్కంఠగా కొనసాగిన మ్యాచ్‌లో ఢిల్లీ పోరాడి ఓటమి చెందగా.. ముంబై ఇండియన్స్ ఖాతాలో రెండో విజయాన్ని వేసుకుంది. 12 పరుగుల తేడాతో కీలక విజయాన్ని ముంబై ఇండియన్స్ అందుకుంది.
Also Read: RCB vs RR: బ్యాట్‌తో విరాట్ కోహ్లీ వీర విహారం.. రాజస్థాన్‌పై బెంగళూరుకు భారీ విజయం
స్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (18) బ్యాట్ నుంచి ఆశించిన పరుగులు రాకపోగా రియాన్ రికల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (50) అద్భుత భాగస్వామ్యం నెలకొల్పి జట్టును భారీ స్కోర్ అందించారు. అనంతరం బరిలో దిగిన తిలక్ వర్మ సంచలన ఇన్నింగ్స్ చేశాడు. 33 బంతుల్లో 59 పరుగులు చేయగా వాటిలో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా రెండు పరుగులకే ఔటవగా.. నమన్ ధీర్ 38 పరుగులతో సత్తా చాటాడు. గెలుపు జోష్‌లో ఉన్న ఢిల్లీ బౌలర్లు పర్వాలేదనిపించారు. విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్ల చొప్పున తీయగా.. ముకేశ్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు.
Also Read: LSG vs GT: గుజరాత్‌కు విజయాలకు లక్నో బ్రేక్.. 6 వికెట్లతో పంత్ సేన హ్యాట్రిక్ విజయం
సమష్టి కృషి చేసి సంచలన విజయాలు అందుకుంటున్న ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్య చేధన చేయలేక సాగీలపడింది. 6 బంతులు మిగిలి ఉండగానే 193 పరుగులతో ఢిల్లీ చాప చుట్టేసింది. జేక్ ఫ్రేజర్ మెక్‌గార్క్ గోల్డెన్ డకౌట్ కాగా.. మిగతా బ్యాటర్ల సహాయంతో కరుణ్ నాయర్ 89 పరుగులతో చేసిన వీరోచిత పోరాటాన్ని తర్వాతి బ్యాటర్లు నిలబెట్టలేకపోయారు. 40 బంతుల్లో 89 కొట్టిన కరుణ్ నాయర్ 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో చెలరేగి ఆడాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లు వచ్చినట్టే వచ్చి మైదానం వీడారు. అశుతోష్ శర్మ (17*), విప్రజ్ నిగమ్ (14) విజయం కోసం కొంత పోరాడారు. కెప్టెన్ అక్షర్ పటేల్ (9)తో సహా మిగతా బ్యాటర్లు పట్టుమని ఇరవై పరుగులు కూడా చేయలేకపోయారు.
వరుస ఓటముల నుంచి తేరుకుని ఒక విజయం కోసం ఉవ్విళ్లూరుతున్న ముంబై జట్టుకు బౌలర్లు భారీ విజయాన్ని అందించారు. ఒక్కో బౌలర్ విరుచుకుపడి మోస్ట్ ఫేవరేట్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముప్పేట దాడి చేశారు. ఫలితంగా ఒక ఓవర్ మిగిలిండగానే 193 పరుగులు చేసింది. మోహత్ శర్మ కూడా గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









