Lionel Messi fan Video: ఇదెక్కడి మాస్ రా మావా.. లియోనల్ మెస్సీ కోసం ఏకంగా హనీమూన్ వాయిదా వేసుకున్న కొత్త జంట.. వీడియో ..

Kolkata couple post pone their honeymoon: ఫుల్ బాల్ దిగ్గజం మెస్సీ అంటే తమకు ఎంతో అభిమానమని కొత్త జంట చెప్పారు. అంతే కాకుండా.. గతంలో ఒకసారి మెస్సీ కోల్ కతాకు వచ్చినప్పుడు తాను చాలా చిన్నవయసులో ఉన్నానని ఇప్పుడు ఎలా అయిన చూడాలని హనీమూన్ కూడా వాయిదా వేసుకున్నట్లు కోల్ కతా జంట చెప్పుకొచ్చారు.   

Written by - Inamdar Paresh | Last Updated : Dec 13, 2025, 02:37 PM IST
  • లియోనల్ మెస్సీని చూసేందుకు అభిమానుల రచ్చ..
  • కోల్ కతాలో హనీమూన్ ను వాయిదా వేసుకున్న జంట..
Lionel Messi fan Video: ఇదెక్కడి మాస్ రా మావా.. లియోనల్ మెస్సీ కోసం ఏకంగా హనీమూన్ వాయిదా వేసుకున్న కొత్త జంట.. వీడియో ..

Newly wed couple post pone their honeymoon to see Lionel messi: ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ భారత్ పర్యటనకు వచ్చాడు. అయితే.. దేశవ్యాప్తంగా అభిమానులు ఆయన్ను చూసేందుకు కోల్ కతాకు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఎక్కడ చూసిన మెస్సీ మెనియా కన్పిస్తుంది. లియోనల్ తో ఫోటోలు దిగేందుకు రూ. 10 లక్షలు వసూలు చేస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం భారత్ లో లియోనల్ మెస్సీ పర్యటనతో ప్రపంచం చూపు అంతా భారత్ పై పడింది. ఈ క్రమంలో కోల్ కతాకు లియోనల్ మెస్సీ చేరుకున్నాడు.

Add Zee News as a Preferred Source

 

 మూడు రోజుల "గోట్" (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) టూర్‌లో భాగంగా శనివారం తెల్లవారుజామున  మెస్సీ కోల కతాకు చేరుకున్నారు. వేలాదిగా అభిమానులు ఫ్లకార్డుులు పట్టుకుని తమ అభిమానంను చాటుకున్నాడు.  అయితే.. అక్కడ ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వీరిలో ఒక కొత్త జంట కూడా ఉన్నారు. వీరి ఫ్లకార్డు అందర్ని ఫిదా చేసింది.

దీనిలో.. గత శుక్రవారమే మాకు పెళ్లయింది. కానీ, మెస్సీని చూడటం కోసం మా హనీమూన్‌ను రద్దు చేసుకున్నామని రాసి ఉన్న ప్లకార్డ్‌ను యువతి పట్టుకుంది. అయితే.. దీనిపై ఆమె మాట్లాడుతూ..  2010 నుంచి మెస్సీకి డైహర్ట్ ఫ్యాన్స్ అని చెప్పుకుంది. తనకు ఇటీవల పెళ్లి అయ్యిందని, ఇద్దరం కూడా మెస్సీకి వీరాభిమానులం అని చెప్పింది.

Read more: Messi Tour: మెస్సీ ఫ్యాన్స్‌ ఫైర్‌.. రూ.12 వేల టిక్కెట్‌.. 10 నిమిషాలు లేడు, కుర్చీలు గ్రౌండ్‌లోకి విసిరేసి ఆగ్రహం..!

మెస్సీ నగరానికి వస్తున్నాడని తెలిసి.. తమ హనీమూన్ కూడా వాయిదా వేసుకున్నట్లు చెప్పింది. గతంతో 2011లో ఆయన వచ్చినప్పుడు చూసే అవకాశం రాలేదు. అప్పుడు మేము చాలా చిన్నవాళ్లమని, ఇప్పుడు మాత్రం ఆ చాన్స్ ను మిస్ చేసుకొవద్దని కోల్ కతాలోనే ఉండిపోయామని సదరు అభిమాని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం యువతి మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News