Real Hero: ఒంటి చెత్తో బ్యాటింగ్.. పగోడు అయినా క్రిస్ వోక్స్ రియల్ హీరో..!

England Hero: ఓ అద్భుతమైన టెస్టు క్రికెట్ సమరానికి తెరపడింది. భారత్ చేతుల్లో ఇంగ్లాండ్ ఓడి.. సిరీస్‌ను డ్రా చేసుకున్నప్పటికీ, అభిమానుల మదిలో నిలిచాడు క్రిస్ వోక్స్. ఇంగ్లాండ్ చివరి ఇన్నింగ్స్‌లో వరుసగా వికెట్స్ కూలుతున్న వేళ.. ఒంటి చేత్తో బ్యాటింగ్‌కి వచ్చిన క్రిస్ వోక్స్ అందరి దృష్టిలో రియల్ హీరో అయ్యాడు.   

Written by - Aruna Maharaju | Last Updated : Aug 4, 2025, 05:33 PM IST
Real Hero: ఒంటి చెత్తో బ్యాటింగ్.. పగోడు అయినా క్రిస్ వోక్స్ రియల్ హీరో..!

Chris Woakes The Real Hero: క్రికెట్‌లో  ఒంటి చెత్తో బ్యాటింగ్  అంటే మాటలు కాదు. ఒకవైపు వికెట్లు పడిపోతుంటే.. తన తోటి ఆటగాళ్లు క్యాబిన్‌కి పరుగు పెడుతుంటే.. క్రీజ్ మీద ఒంటరిగా నిలబడి జట్టు గౌరవాన్ని కాపాడే బ్యాట్స్‌మెన్‌ నిజంగా హీరో. అలాంటి సందర్భాల్లో జట్టుకు పునాదిగా నిలిచేవాడే అసలైన వీరుడు. అలాంటి ఓ సందర్భమే ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో జరిగింది. 

Add Zee News as a Preferred Source

లండ‌న్‌లోని కెన్నింగ్ట‌న్ ఓవ‌ల్ వేదిక‌గా భారత్ ,ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా అద్భుతం చేసింది. ఇంగ్లాండ్‌పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి.. సిరీస్‌ను సమం చేసింది. ఇంగ్లాండ్ పై ఓడిపోయే టెస్టులో 6 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఐదో రోజు గెలుపుకి నాలుగు వికెట్లు కావాల్సి ఉండగా.. భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు..

ఈ మ్యాచ్ తొలి రోజు ఆట‌లో క్రిస్‌వోక్స్ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తూ క్రిస్ వోక్స్ గాయపడగా.. అతని భుజానికి తీవ్ర గాయమైంది. గాయం కార‌ణంగా అతడు చేతికి స్లింగ్ తగిలించుకుని కనిపించాడు. దీంతో అతను ఈ మ్యాచ్‌కు పూర్తిగా దూరమైనట్లేనని అందరూ భావించారు. 

ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఒక్కొక్కరిగా పెవిలియన్‌కి వెళ్తుండటం.. మరో వికెట్ పడితే మ్యాచ్ భారత్ గెలవడం ఖాయం అనుకున్నప్పుడు.. అప్పుడు వచ్చాడు క్రీజులోకి  క్రిస్ వోక్స్. అవసరమైతే క్రిస్ బ్యాటింగ్ చేస్తాడని జో రూట్ ముందుగానే చెప్పినట్టుగానే.. తన జట్టును ఓటమి నుంచి తప్పించడానికి క్రిస్ వోక్స్ బ్యాటింగ్‌కి వచ్చాడు. 

చేతికి గాయం కావడంతో ఒంటి చేత్తో బ్యాటుని పట్టుకుని క్రీజులోకి వచ్చాడు క్రిస్ వోక్స్. దీంతో అతనికి స్ట్రైయిక్ ఇవ్వకుండా గస్ అట్కిన్సన్ బ్యాటింగ్ చేయడం మొదలెట్టాడు. క్రిస్ వోక్స్ 11వ ఆటగాడిగా బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ.. ఒక బాల్ కూడా ఫేస్ చేయకముందే.. ఇండియా బౌలర్లు మ్యాజిక్ చేయడంతో ఇన్నింగ్స్ ముగిసిపోయింది.

Also Read: Saina Nehwal: నెల క్రితమే విడాకులన్నారు.. మళ్లీ అంతలోనే దూరం దగ్గర చేసిందంటూ సైనా నెహ్వాల్ పోస్ట్

Also Read: Mushrooms: పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు.. ప్లేట్‌లో పెట్టండి, ఆరోగ్యం పట్టండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. లైఫ్‌స్టైల్‌, హెల్త్‌,  స్పోర్ట్స్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో ఆరేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News