Palash Mucchal reacts on Smriti Mandhana calls off wedding tragedy: భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ తో తన పెళ్లిని రద్దు చేసుకున్నట్లు తాాజాగా ప్రకటించారు. పలాష్ లో తన పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు స్మృతి మంధాన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. తమ కుటుంబాల గోప్యతను గౌరవించాలని, ఈ విషయంను తాను ఇక్కడితొ వదిలేస్తున్నానని, అందరు కూడా దీన్ని వదిలేస్తారని కోరుకుంటున్నట్లు చెప్పారు. దీంతో గత కొన్నిరోజులుగా వస్తున్న వీరి పెళ్లి వాయిదా అంశంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లైంది.
అయితే.. స్మృతి మంధాన ప్రకటనపై పలాష్ ముచ్చల్ కూడా రియాక్ట్ అయ్యారు. ఈ వ్యక్తిగత సంబంధం నుంచి బయటికి వచ్చానని, ఇక తాను ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే.. కొంత మంది పనిగట్టుకుని తనపై, తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు, రూమర్స్ ను వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇవి పూర్తిగా అసత్యాలని, వీటిని నమ్మవద్దని కూడా చెప్పాడు. తనపై వస్తున్న వదంతులను నిజమని నమ్మేవారిని చూస్తుంటే చాలా బాధగా ఉందన్నాడు. ఒకరి జీవితం మీద ఇలాంటి రూమర్స్ వ్యాప్తి చేయడం సరికాదన్నాడు.
Read more: Smiriti Mandhana: పలాష్ ముచ్చల్‌తో నా పెళ్లి క్యాన్షిల్.. సంచలన ప్రకటన చేసిన స్మృతి మంధాన..
తనపై గురించి, తన కుటుంబం గురించి నిరాధారమైన అబద్ధాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని పలాష్ ముచ్చల్ స్పష్టం చేశాడు. అయితే.. స్మృతి మంధాన పెళ్లి క్యాన్షిల్ ను ప్రకటించగానే.. పలాష్ ముచ్చల్ ఈవిధంగా రియాక్ట్ కావడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









