లంకతో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఘోర అవమానం !!

పాకిస్థాన్ - శ్రీలంక మధ్య  జరుగుతున్న మ్యాచ్ లో హాస్యాస్పద ఘటన చోటు చేసుకుంది

Last Updated : Oct 2, 2019, 12:50 PM IST
లంకతో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఘోర అవమానం !!

కరాచీ వేదికగా  పాక్-లంక మధ్య అంతర్జాజాతీయ మ్యాచ్ ప్రారంభమైంది. ఫ్లడ్ లైట్ల వెలుతూరులో సాగుతున్న డే అండ్ నైట్ మ్యాచ్ ను తిలకించేందుకు వేల మంది ప్రేక్షకుల స్టేడియానికి చేరుకున్నారు. లక్షల మంది టీవీలకు అతుక్కొని కూర్చున్నారు.  మ్యాచ్  అలా ప్రారంభమైందో లేదో ...మ్యాచ్ కు అడుగడుగునా అంతరాయాలే.. 

వర్షం పడిందా అదీ కాదు..మరి ఎందుకు అంతరాయం ?.. ఫ్లడ్ లైట్ల సమస్య ... ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి లైట్లు ఆఫ్ అవుతున్నాయి. ఏమైన సాంకేతిక సమస్య తలెత్తిందా అంటే అది జరగలేదు..మరెందుకు ఈ ఆటంకం అని అనుకుంటున్నారా ?..విషయం గురించి ఆరా తీస్తే కరెంట్ బకాయిలు చెల్లించలేదని పవర్ కట్ చేస్తున్నారట..

ఇలా కరాచీ వేదికగా జరిగిన పాక్- లంక అంతర్జాతీయ మ్యాచ్ సందర్భంగా  పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు అమమానం ఎదురైంది. కరెంట్ బకాయిలు చెల్లించలేదనే కారణంతో కరెంట్ కట్ చేశారు. స్థానిక విద్యుత్ సంస్థ పవర్ కట్ చేయడంతో అంతర్జాతీయ మ్యాచ్ కు తీవ్ర ఆటంకం ఏర్పడంది. ఇలా అంతరాయాలు ఎదుర్కొంటూ నిర్ణీత సమయం గంటే అరగంట లేటుగా మ్యాచ్ ఫినిష్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది .

 ఇలా సిటీ ఆఫ్ లైట్స్ గా పేరుగాంచిన కరాచీ నగరంలో లైట్ల సమస్య రావడం గమనార్హం.కరెంట్ బిల్లును సైతం కట్టలేని స్థితి లో ఉన్న వారు అంతర్జాతీయ మ్యాచ్ లు ఎలా నిర్వహిస్తారంటూ నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. ఇదేమైనా గల్లి క్రికెట్ ఆడుతున్నారా.. స్టేడియం నిర్వాహకులు ఏం చేస్తున్నారు అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురపించారు. మరి దీనిపై ఐసీసీ ఎలా స్పందిస్తుందనే వేచి చూడాల్సి ఉంది.

Trending News