Preity Zinta: ఐపీఎల్ క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ను ఓడించి ఐపీఎల్ కు వెళ్లింది. జూన్ 3న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఫైనల్ మ్యాచులో తలపడనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో 203 పరుగులు చేసినప్పటికీ ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. పంజాబ్ తరపున కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర బ్యాటింగ్ తో పంజాబ్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 11 ఏళ్ల తర్వాత పంజాబ్ జట్టు ఐపీఎల్ ఫైనల్ కు చేరింది.
కెప్టెన్ అయ్యర్ తన జట్టును గెలిపించిన వెంటనే పంజాబ్ కింగ్స్ డకౌట్ సంబురాల్లో మునిగితేలింది. ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ తోపాటు జట్టులోని ఆటగాళ్లంతా ఆనందంతో సంబురాలు చేసుకున్నారు. స్టాండ్స్ లో ఉన్న ప్రీతిజింటా, సహ యజమాని నెస్ వాడియా కూడా ఆనందంతో డ్యాన్స్ చేస్తూ విజయాన్ని జరుపుకున్నారు. బాలీవుడ్ నటి ప్రీతి జింటా తన చేతులను గాల్లోకి పైకెత్తి దూకుతూ మైదానం వైపు పరుగెత్తింది.
ముంబై ఇండియన్స్ జట్టుపై పంజాబ్ గెలిచిన తర్వాత ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మైదానంలో తిరుగుతూ సంతోషంతో ఊగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక పంజాబ్ కింగ్స్ సంబురాల మధ్య ప్రజెంటేషన్ సమయంలో ప్రీతి జింటా ఆటగాళ్లతో ఒకరివైపు చూసి కన్నుగీటిన వీడియో ఫ్యాన్స్ ద్రుష్టిని ఆకర్షించింది. ఆ వీడియోలో పంజాబ్ కింగ్స్ యువ బ్యాటర్ అక్కడ నిల్చుకుని ఉండగా ప్రీతి..జట్టును సరిచేసుకుంటూ ఆ యువ ఆటగాడివైపు కన్ను గీటుతూ ముందుకు వెళ్లింది.
? Preity Zinta’s wink steals the spotlight after Punjab’s semi-final win! ??
As Punjab Kings defeated Mumbai Indians in a thrilling semi-final, a short clip of team co-owner Preity Zinta is going viral -where she appears to wink while glancing towards Nihal Wadhera.
Fans are… pic.twitter.com/NZ23MD70z0
— Irfan isak shaikh (@irfan_speak786) June 2, 2025
Also Read: Girl Gang-Raped: వీళ్లను ఏం చేస్తే మారుతారు? 15ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్..వీడియోతో బ్లాక్‌మెయిల్ !!
ఆమె క్యూట్ ఎక్స్ ప్రెషన్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఆమె నేహాల్ వధేరా వైపు కన్నుకొట్టారా లేదా అతని వెనక మరెవరైనా ఉన్నారాఅనేది స్పష్టంగా కనిపించలేదు. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ప్రీతి జింటాను చూసినవాళ్లు ఏజ్ఈజ్ జస్ట్ నెంబర్ మాత్రమే అంటున్నారు. ఎందుకంటే ఐదు పదుల వయస్సులో ఆమె అందంతో అభిమానులను కట్టిపడేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









