నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్- సీజన్ 6 ప్రారంభం

నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్- సీజన్ 6 ప్రారంభం

Last Updated : Oct 9, 2018, 10:01 PM IST
నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్- సీజన్ 6 ప్రారంభం

ఆదివారం (అక్టోబర్ 7, 2018) నుంచి ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్‌)- సీజన్ 6 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో రాత్రి 7 గంటలకు మొదలుకానుంది. ఆతిథ్య తమిళ తలైవాస్‌తో డిఫెండింగ్‌ చాంపియన్‌ పట్నా పైరేట్స్‌ తలపడనుంది. రాత్రి 8 గంటలకు జరిగే రెండో మ్యాచ్ లో పుణెరి పల్టాన్‌తో యు ముంబా ఢీ కొననుంది.

ఈ సీజన్‌లో మొత్తం 138 మ్యాచ్‌లు జరగనుండగా 11 మ్యాచ్‌లకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. 13 నగరాల్లో నిర్వహించే ఈ లీగ్‌‌లో 12 జట్లు పాల్గొంటున్నాయి. జట్లను రెండు గ్రూపులుగా విభజించగా.. ప్రతి జట్టు 15 ఇంట్రా జోనల్, ఏడు ఇంటర్ జోనల్ మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్-3లో నిలిచిన జట్లు సూపర్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధిస్తాయి. మూడు నెలలపాటు పీకేఎల్‌ ప్రేక్షకులను అలరించనుంది, లీగ్‌ మ్యాచ్‌ల అనంతరం ప్లేఆఫ్‌లు కొచ్చిలో జరుగుతుండగా.. ఫైనల్‌ జనవరి 5న ముంబైలో జరగనుంది.

కూత పెట్టడానికి సిద్ధమైన 12 జట్లు ఇవే..

తెలుగు టైటాన్స్‌, బెంగాల్‌ వారియర్స్‌, బెంగళూరు బుల్స్‌, దబాంగ్‌ ఢిల్లీ, గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌, హరియాణా స్టీలర్స్‌, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌, పట్నా పైరేట్స్‌, పుణెరి పల్టన్‌, తమిళ్‌ తలైవాస్‌, యు ముంబా, యూపీ యోధ.

ప్రొ కబడ్డీ లీగ్- సీజన్ 6 షెడ్యూల్

Trending News