PBKS vs RR Highlights: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి టాప్‌లో దూసుకెళ్లిన ఈ జట్టుకు రాజస్థాన్ రాయల్స్ రూపంలో పరాజయం ఎదురైంది. అద్భుతంగా.. ఫుల్ జోష్‌తో ఉన్న పంజాబ్‌కు రాజస్థాన్ భారీ దెబ్బ తీసింది. చండీగడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను 50 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓడించింది. నిర్ణీత ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి పంజాబ్ 205 పరుగులు చేయగా.. రాజస్థాన్ 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసి పరాజయం పాలైంది.
Also Read: CSK vs DC: ఐపీఎల్‌లో సంచలనం.. ఢిల్లీ హ్యాట్రిక్ విజయం.. చెన్నై హ్యాట్రిక్ ఓటమి
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 45 బంతులకు 67 పరుగులు చేయగా.. రియాన్ పరాగ్ 43 స్కోర్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. సంజూ శామ్‌సన్ 38 పరుగులతో సత్తా చాటాడు. హెట్‌మేర్ (20), నితీశ్ రాణా (12), ధ్రువ్ జురేల్ (13) కొంత పరుగులు రాబట్టారు. పంజాబ్ బౌలర్లు పరుగులను నియంత్రించడంలో కొంత వెనుకబడ్డారు. లాకీ ఫెర్గూసన్ 2 వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, మార్కో జెన్‌సన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
Also Read: LSG vs MI: ఉత్కంఠ మ్యాచ్‌లో ముంబై ఓటమి.. లక్నోకు మరో విజయం
రాజస్థాన్ విధించిన 206 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ చేధించలేక చతికిలపడింది. 20 ఓవర్లకు 155 పరుగులు చేసి ఆలౌట్‌కు ఒక వికెట్ దూరంలో నిలిచింది. నేహల్ వధేరా 41 బంతుల్లో 62 పరుగులు చేయగా.. గ్లెన్ మాక్స్‌వెల్ (30), ప్రభుషిమ్రాన్‌సింగ్ (17) పర్వాలేదనిపించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భారీ స్కోర్ చేయడంలో తడబడి 10 పరుగులకే ఔటయ్యాడు. ప్రియాన్షు ఆర్య గోల్డెన్ డకౌట్ కాగా.. స్టోయినిస్ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. బ్యాటర్లు నిలిపిన స్కోర్‌ను రాజస్థాన్ బౌలర్లు నిలబెట్టారు. పంజాబ్ బ్యాటర్లను స్కోర్‌నివ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో 9 వికెట్లు పడ్డాయి. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, మహీశ్ తీక్షణ తలా రెండు వికెట్లు తీశారు. కుమార్ కార్తీకేయ, వహిందు హసరంగా ఒక్కో వికెట్ పడగొట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









