close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

నీ మౌనం చిరస్థాయిగా నిలిచిపోతుంది... కివీస్ సారథిపై టీమిండియా కోచ్ ప్రశంసలు

వరల్డ్ కప్ కొద్దిలో చేజారినా కివీస్ కెప్టెన్ చూపిన సంయమనంపై సర్వత్రా ప్రసంశల జల్లు కురుస్తోంది

Updated: Jul 17, 2019, 05:36 PM IST
నీ మౌనం చిరస్థాయిగా నిలిచిపోతుంది... కివీస్ సారథిపై టీమిండియా కోచ్ ప్రశంసలు

ఐసీసీ నిబంధనల కారణంగా వరల్డ్ లో ఫైనల్లో మ్యాచ్ లో ఓడిపోయిన న్యూజీలాండ్ జట్టుకు భారత్ తో సహా ప్రపంచ దేశాల సానుభూతి లభిస్తోంది. తాజాగా కివీస్ సారథి విలియమ్సన్ తీరును ప్రసంశిస్తూ టీమిండియా కోచ్ ట్వీట్ చేశాడు.. ఐసీసీ నింబంధనల కారణంగా వరల్డ్ కప్ ఫైనల్లో చవిచూసినప్పటికీ కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఎంతో హుందాగా వ్యవహరించాడని... అతను ప్రదర్శించిన క్రీడా స్పూర్తి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుందని రవిశాస్త్రి ప్రసంశించాడు.వరల్డ్ కప్ కొద్దిలో చేజారినా కివీస్ కెప్టెన్ చూపిన సంయమనం అద్భుతమని కొనియాడాడు.

ఉద్వేగభరితమైసందర్భంలోనూ ఓటమికి కారణమైన ఐసీసీ బౌండరీల నిబంధనలపై విలియమ్సన్ ఒక్క మాటా అనకపోవడంపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి కూడా అభినందించాడు.  ఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత రెండ్రోజుల పాటు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా నువ్వు పాటించిన మౌనం చాలా గొప్పగా ఉంది. ఎంతో సంక్లిష్టమైన పరిస్థితిలో నువ్వు చూపించిన ఓర్పు చిరస్థాయిగా నిలిచిపోతుందని టీమిండియా హోడ్ కోచ్ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు