IPL 2025 Winner RCB: పంజాబ్‌ గుండెలు బ్రేక్‌.. ఐపీఎల్‌ 2025 విజేత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

Royal Challengers Bengaluru Bags IPL 2025 Trophy Against Punjab Kings: ఐపీఎల్‌-2025 ఫైనల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చరిత్ర సృష్టించింది. తొలి ట్రోఫీని ముద్దాడగా.. రెండోసారి కూడా పంజాబ్‌ కింగ్స్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఉత్కంఠ కలిగిన మ్యాచ్‌లో బెంగళూరు భళా అనిపించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 3, 2025, 11:38 PM IST
IPL 2025 Winner RCB: పంజాబ్‌ గుండెలు బ్రేక్‌.. ఐపీఎల్‌ 2025 విజేత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

RCB Wins IPL 2025: ఐపీఎల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం నుంచి ఆడుతున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు తొలి ట్రోఫీ దక్కింది. ఉత్కంఠ రేకెత్తించిన ట్రోఫీ పోరులో పంజాబ్‌ కింగ్స్‌ పోరాడినా కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. అహ్మదాబాద్‌ స్టేడియంలో మంగళవారం జరిగిన ఆఖరి యుద్ధంలో హోరాహోరీగా తలపడినా పంజాబ్‌పై బెంగళూరు పైచేయి సాధించి ఐపీఎల్‌ 2025 ట్రోఫీని కైవసం చేసుకుంది. 18 ఏళ్లుగా తీరని కలగా ఉన్న ఐపీఎల్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది.

Add Zee News as a Preferred Source

Also Read: IPL 2025 RCB Vs PBKS: ఐపీఎల్ 2025 ట్రోఫీ కోసం బెంగళూరు, పంజాబ్‌ హోరాహోరీ.. లక్ష్యం 190

ట్రోఫీ సాధన కోసం జరిగిన తుది పోరులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌ హోరాహోరీగా పోరాడాయి. ఫైనల్ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి పంజాబ్‌ కింగ్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఓవర్లు పూర్తి చేసుకున్న పంజాబ్‌ కింగ్స్‌ 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు సాధించి ఓటమిని చవిచూసింది.

Also Read: IPL 2025 Final: ఐపీఎల్‌ ఫైనల్‌ టాప్ 10 ముఖ్యాంశాలు.. తొలి విజేత ఎవరో తెలుసా?

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగగా భారీ స్కోర్లు సాధించడంలో బ్యాటర్లు విఫలమయ్యారు. ఫిల్‌ సాల్ట్‌ (16), మయాంక్‌ అగర్వాల్‌ (24) పర్వాలేదనిపించగా.. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ తన ఆటకు భిన్నంగా ఆడాడు. 35 బంతుల్లో 43 పరుగులు చేసి దాదాపుగా క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నాడు. వరుస వికెట్లు కోల్పోతున్న సమయంలో జట్టు విజయం కోసం పోరాడాలనుకున్నా అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ వేసిన బంతికి చిక్కాడు. నాలుగు ఫోర్లు బాదిన కోహ్లీ ఒక్క సిక్స్‌ కూడా కొట్టకపోవడం గమనార్హం. కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌తోపాటు లియామ్‌ లివింగ్‌స్టోన్‌ కూడా భారీ స్కోర్‌ నమోదు చేయలేదు. పాటిదర్‌ 26, లివింగ్‌స్టోన్‌ 25 పరుగులకే పరిమితమయ్యారు. జితేశ్‌ శర్మ కూడా 10 బంతుల్లో 24 పరుగులు చేసి వెనుదిరగ్గా.. షెఫర్డ్‌ 17 పరుగులు జోడించగా.. కృనాల్‌ పాండ్యా 4, భువనేశ్వర్‌ కుమార్‌ 1 అతి తక్కువ పరుగులు చేశారు.

పంజాబ్‌ బౌలింగ్‌తో బెంబేలు
తమకు కూడా తొలి ట్రోఫీ కావడంతో పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లు కసితీరా బౌలింగ్‌ చేశారు. పవర్‌ ప్లే మొదలుకుని ఆఖరి ఓవర్‌ వరకు పకడ్బందీ బౌలింగ్‌ వ్యూహంతో బెంగళూరు బ్యాటర్లను ఎక్కడా కూడా భారీ స్కోర్‌ చేయనివ్వలేదు. పరుగులను మరికొంత నియంత్రించాల్సి ఉన్నా వికెట్లు మాత్రం టపాటపా తీశారు. మొదట టాపార్డర్‌ను దెబ్బతీసి బెంగళూరు బ్యాటింగ్‌ దళం నీరుగార్చారు. అనంతరం మిడిలార్డర్‌ బ్యాటర్లపై కూడా అదే వ్యూహంతో బంతులు వేసి స్కోర్‌ను 200 దాటించలేదు. అర్ష్‌దీప్‌ సంచలన ప్రదర్శన కనబర్చి కీలకమైన మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని భారీ దెబ్బతీశాడు. కేల్‌ జేమిసన్‌ కూడా అదే పదునైన బంతులతో బెంగళూరు బ్యాటింగ్‌ దళం నడ్డి విరిచాడు. అజ్ముత్లా ఒమర్‌ జాయ్‌, వైశాక్‌ విజయ్‌ కుమార్‌, చాహల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. అయితే ఇంకాస్త పకడ్బందీ బౌలింగ్‌ వేస్తే బ్యాటర్లు ఛేదించడానికి సులువయ్యేదనే అభిప్రాయం వ్యక్తమైంది.

బ్యాటర్లు విఫలం
ఛేదనకు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లు పూర్తి చేసుకుని 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. ప్రియాన్ష్‌ ఆర్య 24, ప్రభు సిమ్రాన్‌ సింగ్‌ 26 పరుగులతో పర్వాలేదనిపించారు. జోష్‌ ఇంగ్లీస్‌ 23 బంతుల్లో 39 పరుగులు చేసి రాణించాడు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఒక్క పరుగుతోనే ఔటవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. నేహాల్‌ వదేరా 15 స్కోర్‌తో నిరాశపర్చగా.. మార్కస్‌ స్టోయినిస్‌ (6), ఒమర్‌జాయ్‌ ఒక్క పరుగు చేసి ఓటమికి బాట చూపారు. వరుస వికెట్లు పడుతూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ట్రోఫీ కోసం శశాంక్‌ సింగ్‌ చివరి దాకా పోరాడాడు. 30 బంతుల్లో 61 పరుగులు చేసి భారీ స్కోరర్‌గా నిలిచాడు. మూడు ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగి ఆడాడు. అయినా కూడా జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు.

విజయం అందించిన బౌలర్లు
బెంగళూరు బౌలర్లు పకడ్బందీగా బంతులు వేసి జట్టుకు మొదటి ట్రోఫీని అందించారు. భువనేశ్వర్‌ కుమార్‌, కృనాల్‌ పాండ్యా రెండేసి వికెట్లు తీయగా.. యశ్‌ దయాల్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, రొమారియో షెఫర్డ్‌ ఒక్కో వికెట్‌ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News