Bengaluru Stampede: మొదలైన అరెస్టులు..ఆర్సీబీ మేనేజ్ మెంట్ కు భారీ షాక్..!!

Bengaluru Stampede: ఆర్సీబీ మెనేజ్ మెంట్ కు భారీ షాక్ తగిలింది. బెంగళూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Written by - Bhoomi | Last Updated : Jun 6, 2025, 09:05 AM IST
Bengaluru Stampede: మొదలైన అరెస్టులు..ఆర్సీబీ మేనేజ్ మెంట్ కు భారీ షాక్..!!

Bengaluru Stampede: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మేనేజ్ మెంట్ కు బిగ్ షాక్ తగిలింది. జూన్ 4 బుధవారం ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి బెంగళూరు పోలీసులు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను అరెస్టు చేశారు. నిఖిల్ సోసాలే బెంగళూరు నుండి ముంబైకి బయలుదేరినప్పుడు అరెస్టు జరిగింది. బెంగళూరు విమానాశ్రయంలో ఆయనను అరెస్టు చేశారు.

Add Zee News as a Preferred Source

నిఖిల్ తోపాటు విజయోత్సవ ఈవెంట్ నిర్వాహక సంస్థ డీఎన్ఏ ఎంటర్ టైన్ మెంట్ నెట్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆర్సీబీ టీమ్ మేనేజ్ మెంట్ నిఖిల్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ విజయోత్సవ ఈవెంట్ను కూడా డీఎన్ఏ సంస్థతో కలిసి ఆయనే కోఆర్డినేట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. 

కాగా బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. 50 మందికిపైగా గాయపడ్డారు. విజయోత్సవ ర్యాలీ నిర్వహణపై చేసిన భిన్నమైన ప్రకటనలే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. అందర్నీ ఏకకాలంలో అనుమతించడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. 

Also Read: Electric Scooter: ఒకసారి ఛార్జ్ చేస్తే 146KM దూసుకుపోతుంది.. స్మార్ట్ ఫోన్ కంటే ..చీపెస్ట్ ఎలక్ట్రిక్ బైక్  ఇదే..!!  

కర్నాటక హైకోర్టు కూడా ఈ ఘటనను సుమోటోగా పరిగణించి విచారణ చేపట్టింది. లక్షలాది మంది క్రీడాభిమానులతో ముడిపడిన కార్యక్రమాన్ని నిర్వహించడంలో వైఫల్యం ఎవరిదో తేల్చి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు సూచనతో రాష్ట్ర ప్రభుత్వం తొక్కిసలాట ఘటన దర్యాప్తునకు సీఐడీ పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బ్రుందాన్ని ఏర్పాటు చేసింది. ఘటనకు కర్నాటక క్రికెట్ సమాఖ్య, ఆర్సీబీ ప్రతినిధులను బాధ్యులుగా పేర్కొంటూ వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా అరెస్టులు చోటుచేసుకుంటున్నాయి. 

Also Read: Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి సూపర్ మైలేజ్ బైక్..ధర కూడా చాలా తక్కువ తమ్ముడు..!!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News