)
RCB Ownership Sale: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అభిమానులకు షాకింగ్ న్యూస్. వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు కనిపించదు. ఈ విషయం తెలుసుకున్న ఆర్సీబీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఆ షాకింగ్ న్యూస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యధిక అభిమానులు ఉన్న టాప్ 3 జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. అభిమానుల సంఖ్య, విలువ పరంగా RCB చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌తో పోటీపడుతుంది.
RCB IPL 2025 ఛాంపియన్లుగా నిలిచి ప్రతిష్టాత్మకమైన IPL ట్రోఫీని కూడా గెలుచుకుంది. కోహ్లీ RCBకి కేంద్ర బిందువుగా ఉన్నాడు. IPL ప్రారంభం నుండి అతను RCBతోనే ఉన్నాడు. ధోని, రోహిత్ శర్మ వంటి వ్యక్తులు ఒకటి లేదా రెండు జట్లకు ఆడినప్పటికీ, కోహ్లీ RCBతోనే ఉన్నాడు. కానీ వచ్చే ఏడాది మార్చి 31 తర్వాత RCB IPLలో కనిపించదు.
ఎందుకంటే గతంలో యజమానులు RCB జట్టును అమ్మకానికి పెట్టారని వార్తలు వచ్చాయి. అయితే, ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ క్రిక్‌బజ్ అది నిజమేనని పేర్కొంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఆర్సీబీ మేనేజ్మెంట్ ఐపీఎల్ మహిళల, పురుషుల జట్లను అమ్మకానికి పెట్టారు.
మార్చి 31 నాటికి ఎవరైనా కొనుగోలుదారు ముందుకు వస్తే RCB పేరు మారే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం RCB బ్రాండ్ విలువ రూ.2,247 కోట్లు. ప్రస్తుతం చాలా మంది పెద్ద వ్యాపారవేత్తలు RCBని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు. ఈ ప్రక్రియ మార్చి 31, 2026 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook