RCB Sale Price 2025: విరాట్ కోహ్లీ RCB టీమ్ కొత్త ఓనర్ వచ్చేశాడు! ఏకంగా రూ.20,000 కోట్లతో కొనుగోలు చేసిన బడా బిజినెస్‌మ్యాన్!

Sanjay Govil RCB Ownership: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) గత సీజన్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్‌ను ఆ యాజమాన్యం అమ్మకానికి ఉంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుత యజమానిగా ఉన్న యూనైటెట్ స్పిరిట్స్ మద్యం తయారీ సంస్థ ఇప్పుడు తన ఫ్రాంఛైజీని పూర్తిగా అమ్మకానికి పెట్టేసింది.

Written by - Harish Darla | Last Updated : Dec 5, 2025, 03:29 PM IST
RCB Sale Price 2025: విరాట్ కోహ్లీ RCB టీమ్ కొత్త ఓనర్ వచ్చేశాడు! ఏకంగా రూ.20,000 కోట్లతో కొనుగోలు చేసిన బడా బిజినెస్‌మ్యాన్!

Sanjay Govil RCB Ownership: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) గత సీజన్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్‌ను ఆ యాజమాన్యం అమ్మకానికి ఉంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుత యజమానిగా ఉన్న యూనైటెట్ స్పిరిట్స్ మద్యం తయారీ సంస్థ ఇప్పుడు తన ఫ్రాంఛైజీని పూర్తిగా అమ్మకానికి పెట్టేసింది. 2025 సీజన్‌లో RCB తమ తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పటికీ.. విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట ఘటన సహా అనేక వివాదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Add Zee News as a Preferred Source

మార్చి 2026 నాటికి ఆర్సీబీ టీమ్ సేల్ పూర్తవుతుందని అంచనా. అయితే ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ వాల్యూ 2 బిలియన్ డాలర్లు వరకు ఉంటుందని సమాచారం. అంటే సుమారు రూ.20,000 కోట్ల వరకు ఈ ఫ్రాంఛైజీ వాల్యూ ఉంటుందని అంటున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ ఫ్రాంఛైజీల్లో ఇదొకటిగా నిలిచింది. తాజాగా సమాచారం ప్రకారం సంజయ్ గోవిల్ వచ్చే ఏడాది మార్చి లేదా అంతకంటే ముందే టీమ్ అమ్మకం పూర్తవుతుందని తెలుస్తోంది.

Also Read: Zodiac Signs: ఈ 3 రాశుల వారు తిరుమల కొండ అస్సలు ఎక్కకూడదు! ఏం జరుగుతుందో తెలుసా?

సంజయ్ గోవిల్ ఎవరు?
సంజయ్ గోవిల్ ఒక భారతీయ-అమెరికన్ టెక్ బిలియనీర్, క్రీడా వ్యవస్థాపకుడు. అతను ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) IPL ఫ్రాంచైజీని కొనుగోలు చేయడానికి ప్రముఖ పోటీదారుగా ఉన్నట్లు సమచారం. అతను గ్లామోర్గాన్ క్రికెట్ క్లబ్‌తో పాటు వెల్ష్ ఫైర్ క్రికెట్ జట్టుకు సహ-యజమానిగా ఉన్నాడు.

అంతేకాకుండా యునైటెడ్ స్టేట్స్‌(USA)లోని మేజర్ లీగ్ క్రికెట్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు యజమానిగానూ ఉన్నాడు. గోవిల్.. తన ప్రస్తుత భాగస్వాములతో కలిసి, ప్రపంచ ఫ్రాంచైజ్ క్రికెట్ యాజమాన్యంలో అత్యంత సంపన్న ఫ్రాంఛైజీ RCBని కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సంజయ్ గోవిల్, అతని భాగస్వాములు RCBని కొనుగోలు చేయడంలో విజయం సాధిస్తే.. ఇదొక చరిత్ర అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సుమారు రూ.20,000 కోట్లు ఖర్చుపెట్టి..ప్రపంచంలోని అత్యంత పాపులరిటీ పొందిన క్రికెట్ ఫ్రాంఛైజీని సొంతం చేసుకోవచ్చు.

RCB చివరి సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచి.. ఆఫ్-ఫీల్డ్ యజమానుల మార్పు జరగనుందని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. ఇప్పుడు కొత్తగా రానున్న మేనేజ్‌మెంట్ పోటీలో ఇతర బిడ్డర్లతో పోలిస్తే ముందున్నారు. దాదాపుగా సంజయ్ గోవిల్ ఈ ఫ్రాంఛైజీని సొంతం చేసుకునే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. 

Also Read: Bank Holidays: బ్యాంకులకు 10 రోజులు సెలవులు..ఈ పనులు ముందే కానివ్వండి..బంద్ ఎప్పుడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.  గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

...Read More

Trending News