Royal Challengers Bengaluru Vs Punjab Kings IPL 2025: ఐపీఎల్ 2025 ఫైనల్ సమరానికి రంగం సిద్దమైంది. లీగ్ దశలో టాప్-2 స్థానాల్లో నిలిచిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లే ఫైనల్‌కు చేరుకున్నాయి. క్వాలిఫయర్-1లో పంజాబ్‌పై విజయంతో ఆర్‌సీబీ ఫైనల్‌కు చేరుకోగా.. క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి పంజాబ్ కింగ్స్ ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండు జట్లు బలంగా ఉండడంతో పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఆర్‌సీబీలో విరాట్ కోహ్లీ, పంజాబ్‌లో శ్రేయాస్ అయ్యర్ భీకర్ ఫామ్‌లో ఉండడగా.. బౌలింగ్‌లో ఆర్‌సీబీకి జోష్ హేజిల్‌వుడ్.. పంజాబ్‌కు అర్ష్‌దీప్ సింగ్ కీలకంగా మారనున్నారు. బెంగళూరు నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్ ఆడుతుండగా.. పంజాబ్ రెండోసారి ఫైనల్ ఆడుతోంది. రెండు జట్లలో ఎవరు గెలిచినా.. ఐపీఎల్‌లో కొత్త ఛాంపియన్‌గా అవతరించనున్నారు. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది..? హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి..? తుది జట్లు ఎలా ఉంటాయి..? డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..
పిచ్ రిపోర్ట్ ఇలా..
ఫైనల్ పోరు నరేంద్ర మోదీ స్టేడియంలోని సెంట్రల్ వికెట్‌పై నిర్వహించనున్నారు. ఇక్కడ నుంచి రెండు వైపులా సమాన బౌండరీ లెంగ్త్ ఉంటుంది. ఈ పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ వేదికలో జరిగిన 15 మ్యాచ్‌లలో 10 ఇన్నింగ్స్‌లలో మొత్తం 200 పరుగుల మార్కును దాటింది. ఈ మ్యాచ్ కూడా హైస్కోరింగ్ గేమ్‌గా మారే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇవాళ అహ్మదాబాద్‌లో ఉష్ణోగ్రత 36°C ఉంటుంది. చివరి నాటికి 31°Cకి పడిపోతుంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే.. రిజర్వ్ డే (జూన్ 4) ఉంది. రేపు కూడా వర్షం వల్ల మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే.. గ్రూప్ దశలో టాప్ ప్లేస్‌లో నిలిచిన పంజాబ్ విజేతగా నిలవనుంది.
హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య 36 మ్యాచ్‌లు జరిగాయి. రెండు జట్లు కూడా చెరో 18 మ్యాచ్‌లలో విజయం సాధించి.. సమ ఉజ్జీలుగా ఉన్నాయి. లీగ్ దశలో చెరో మ్యాచ్ గెలుపొందగా.. క్వాలిఫయర్- 1లో పంజాబ్ కింగ్స్‌ను ఆర్‌సీబీ ఓడించింది. అయితే బలంగా ఉన్న ముంబైను ఓడించి.. ఆత్మవిశ్వాసంతో పంజాబ్ ఫైనల్‌కు చేరింది. రెండు జట్లు తొలి ట్రోఫీ కోసం ఎదురుచూస్తుండగా.. ఎవరు గెలుస్తారోనని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
తుది జట్లు ఇలా..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ ధయాల్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్‌జా, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, విజయ్‌కుమార్ వైషాక్.
RCB Vs PBKS Dream11 Team Tips:
==> వికెట్ కీపర్: జోష్ ఇంగ్లిస్
==> బ్యాటర్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ (కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, రజత్ పటీదార్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్
==> ఆల్-రౌండర్లు: మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా
==> బౌలర్లు: జోష్ హేజిల్‌వుడ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
Also Read: IPL 2025 Final: విరాట్ కోహ్లీ 18 ఏళ్ల నిరీక్షణ ఫలిస్తుందా, ఐపీఎల్‌లో విరాట్ రికార్డు
Also Read: Tirumala Darshanam Time: తిరుమలలో పోటెత్తుతున్న భక్తులు దర్శనానికి ఎంత సమయం పడుతోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









