RCB Vs PBKS IPL 2025 Final Highlights: 18 ఏళ్ల తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కల నెరవేరింది. ఫైనల్ పోరులో పంజాబ్ కింగ్స్‌పై ఆరు పరుగులతో విజయం సాధించి.. తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్ టాస్ గెలిచి పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 43 పరుగులు చేయగా.. రజత్ పటీదార్ 26, లివింగ్‌స్టోన్ 25, జితేష్ శర్మ 24 పరుగులు చేశారు. జితేష్ శర్మ ఆడిన షాట్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాయి. ఆడిన పది బంతుల్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్ల సాయంతో 24 రన్స్ చేసి.. కీ రోల్ ప్లే చేశాడు. జేమీసన్ బౌలింగ్‌లో కీపర్ వెనుక షాట్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
When @ABdeVilliers17 approves, you know it’s special! ?
That fearless lap shot by #JiteshSharma in the #IPLFinal had even Mr. 360 in awe. What a moment! ?
LIVE NOW ➡ https://t.co/XmOkxMNq4t#IPLFinal ? #RCBvPBKS on Star Sports Network & JioHotstar pic.twitter.com/RIrYBU9wkh
— Star Sports (@StarSportsIndia) June 3, 2025
చప్పగా సాగుతున్న ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్ స్వరూపాన్ని మార్చేసింది. కైల్ జేమీసన్ 17వ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఆ సమయంలో జితేష్ శర్మ స్ట్రైక్‌లో ఉన్నాడు. జేమీసన్ మొదటి బంతిని మంచి లెంగ్త్‌లో బౌలింగ్ చేశాడు. అయితే ఈ బంతిలో జితేష్ శర్మ డిఫరెంట్ షాట్ కొట్టాడు. లగాన్ స్టైల్ వికెట్ కీపర్ తలపై సిక్స్ కొట్టాడు. ఈ షాట్ చూసి కామెంట్రీ బాక్స్‌లో ఉన్న ఏబీ డివిలియర్స్ కూడా షాక్ అయ్యాడు. ఈ సిక్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తరువాతి బంతిని కూడా జితేష్ శర్మ సిక్సర్‌గా మలిచాడు. ఇదే ఓవర్‌లో లివింగ్‌స్టోన్ కూడా ఓ సిక్సర్ బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి.
అయితే 18వ ఓవర్‌లో వైషాక్ కేవలం 5 పరుగులే ఇవ్వగా.. 19వ ఓవర్‌లో అజ్మతుల్లా 14 రన్స్ ఇచ్చాడు. ఇక చివరి ఓవర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడు వికెట్లు తీసి.. కేవలం మూడు పరుగులు ఇచ్చాడు. దీంతో కచ్చితంగా 200 పరుగులు దాటుతుందని అనుకున్న పంజాబ్ స్కోరు.. 190 రన్స్ వద్దే ఆగిపోయింది. ఇదే పిచ్‌లో ముంబైపై 200 పైగా లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ ముందు ఈ టార్గెట్ సరిపోతుందా అని ఆర్‌సీబీ ఫ్యాన్స్ కంగారు పడ్డారు. అందుకే తగ్గట్లే పంజాబ్ ఇన్నింగ్స్ కూడా ఆరంభంలోనే దూకుడుగా సాగింది. అయితే వరుస విరామల్లో వికెట్లు కోల్పోవడం.. సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడం.. ఆర్‌సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ ఓటమి వైపు పయనించింది. చివర్లో సుశాంక్ సింగ్ 30 బంతుల్లో 61 పరుగులతో దూకుడుగా ఆడినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ఆరు పరుగులతో ఓటమిపాలైంది. ఆర్‌సీబీ విజయంతో 18 ఏళ్లుగా ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ సంబరాలు ఒక్కసారిగా అంబరాన్ని అంటాయి.
Also Read: TTD News: శ్రీవారి మెట్టు నుంచి తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









