Rohit Sharma: పొమ్మనలేక పొగబెట్టారా? టెస్టు క్రికెట్‌కు రోహిత్ శర్మ గుడ్ బై!

Rohit Sharma Announce Retirement From Test Cricket: భారత స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ టెస్టు క్యాప్‌ను కిందపెట్టేశారు. టెస్టు క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు రోహిత్‌ శర్మ ప్రకటించారు. అతడిని పొమ్మనలేక పొగబెట్టారా? అనే చర్చ నడుస్తోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 7, 2025, 08:05 PM IST
Rohit Sharma: పొమ్మనలేక పొగబెట్టారా? టెస్టు క్రికెట్‌కు రోహిత్ శర్మ గుడ్ బై!

Rohit Sharma Retirement: భారత స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్టు క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. సుదీర్ఘ కాలంగా ఆడుతున్న టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు రోహిత్‌ శర్మ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన రోహిత్‌ శర్మ తన టెస్టు క్రికెట్‌ క్యాప్‌ను కిందపెట్టారు. అనూహ్యంగా రోహిత్‌ శర్మ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద తతంగమే జరిగినట్టు తెలుస్తోంది. పొమ్మనలేక పొగబెట్టినట్లు.. విరాట్‌ కోహ్లీ మాదిరి అవమానించినట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే రోహిత్‌ శర్మ టీ20 క్రికెట్‌కు బై బై చెప్పగా.. తాజాగా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే రోహిత్‌ శర్మ కొనసాగనున్నాడు.

Add Zee News as a Preferred Source

Also Read: MS Dhoni Retires: సీఎస్కే ఫ్యాన్స్‌కు షాక్‌.. కొన్నిరోజుల్లోనే ధోనీ రిటైర్మెంట్‌?

 

గౌరవంగా భావిస్తున్నా..
టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్‌ శర్మ పోస్టు చేశాడు. 'అందరికీ నమస్కారం. టెస్టు క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్న విషయాన్ని మీతో పంచుకుంటున్నా. టెస్టు క్రికెట్‌లో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా. కొన్ని సంవత్సరాలుగా మీ ప్రేమాభిమానం.. మద్దతుకు ధన్యవాదాలు. వన్డే ఫార్మాట్‌లో భారత జట్టు తరఫున ప్రాతినిథ్యం కొనసాగిస్తా' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్‌ శర్మ రాసుకొచ్చాడు.

Also Read: Rohit Sharma: టెస్టు కెప్టెన్సీ నుంచి రోహిత్‌ శర్మ ఔట్‌? తదుపరి కెప్టెన్‌ ఎవరు?

 

టెస్టు క్రికెట్‌లో రోహిత్‌ శర్మకు ఘన చరిత్ర ఉంది. 38 ఏళ్ల రోహిత్‌ శర్మ టెస్టు కెరీర్‌లో మొత్తం 67 మ్యాచ్‌లు ఆడాడు. 40.57 సగటుతో 4,301 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా 24 టెస్టుల్లో భారత జట్టుకు రోహిత్‌ శర్మ సారథ్యం వహించాడు. వచ్చే నెలలో జరగనున్న ఇంగ్లాండ్‌ పర్యటనకు భారత జట్టు ఎంపికకు ముందు రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ ప్రకటించడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో బోర్డర్‌ గవాస్కర్‌ టోర్నీలో రోహిత్‌ శర్మ తీవ్ర నిరాశపర్చాడు. పేలవ ఫామ్‌ కారణంగా చివరి టెస్టు నుంచి రోహిత్‌ స్వతహాగా తప్పుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు రెండుసార్లు విజయం రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోనే.

టెస్టుల్లో రోహిత్‌ శర్మ ప్రస్థానం
4,301 పరుగులు
12 సెంచరీలు
18 అర్థ శతకాలు
88 సిక్సర్లు
473 ఫోర్లు

  • డబ్ల్యూటీసీఎస్‌లో భారతదేశం తరపున రోహిత్‌ శర్మ అత్యధిక పరుగులు సాధించాడు.
  • రోహిత్‌ కెప్టెన్సీలో భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను రెండుసార్లు గెలిచింది.

టెస్టు సారథ్య బాధ్యతల నుంచి రోహిత్‌ శర్మను తప్పిస్తుందనే వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న ఇంగ్లాండ్‌ సిరీస్‌తోపాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ నేపథ్యంలో రోహిత్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉండడంతో గౌరవప్రదంగా రోహిత్‌ తప్పుకున్నట్లు చర్చ జరుగుతోంది. టెస్టు క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం కలిగిన తనను కేవలం ఆటగాడిగా కొనసాగడం భావ్యం కాదని రోహిత్‌ శర్మ ఇలా ఎర్ర బంతి ఆటకు వీడ్కోలు పలికాడని అర్థమవుతోంది. రోహిత్‌ వైదొలగడంతో తదుపరి భారత టెస్టు క్రికెట్‌ కెప్టెన్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. తదుపరి టెస్టు కెప్టెన్‌ ఎవరు? అనే చర్చ జోరుగా సాగుతోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News