)
Rohit Sharma Weight Loss Journey: భారత క్రికెట్ జట్టుకు అద్భుతమైన కెప్టెన్లలో రోహిత్ శర్మ ఒకరు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు చిరస్మరణీయ విజయాలు అందించి సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు. టీ20, టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్ 2027 ప్రపంచకప్ వరకు వన్డే క్రికెట్లో కొనసాగాలని భావిస్తున్నాడు. అనంతరం క్రికెట్ నుంచి వైదొలగాలననే ప్రణాళికలో రోహిత్ ఉన్నాడు. అతడి క్రికెట్ పక్కనపెడితే రోహిత్ శర్మ బరువు తగ్గాడనే వార్త వైరల్‌గా మారింది. ఏకంగా 20 కిలోల బరువు తగ్గాడని.. స్లిమ్ అయ్యాడని చర్చ జరుగుతోంది. అతడి వెయిట్‌లాస్ జర్నీ తెలుసుకుందాం.
కొంతకాలంగా రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై చర్చ జరుగుతోంది. రోహిత్ ఫిట్‌గా లేడని.. ప్రదర్శన పేలవంగా ఉందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ తర్వాత విరాట్, రోహిత్‌లను వన్డే జట్టు నుంచి తప్పించేందుకు బీసీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2027 ప్రపంచకప్ టోర్నీకి శుభ్‌మన్ గిల్ సారథ్యంలో జట్టు వెళ్తుందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఫిట్నెస్ లేని రోహిత్ శర్మతో ఐసీసీ వన్డే ట్రోఫీ కష్టమనే అభిప్రాయం నేపథ్యంలో హిట్‌మ్యాన్ తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
2024 శ్రీలంక వన్డే సిరీస్ పూర్తి చేయడానికి ముందు రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాడు. రోహిత్ శర్మ తన శరీరాన్ని తిరిగి ఫిట్‌గా మార్చుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడని తెలుస్తోంది. ఇటీవల మాజీ కోచ్ అభిషేక్ శర్మతో కలిసి బెంగళూరులోని ఎన్సీఏలో జరిగిన ఫిట్నెస్ పరీక్షలో రోహిత్ శర్మ పాల్గొని ఉత్తీర్ణుడయ్యాడు. ఇప్పుడు అతను పూర్తి ఫిట్నెస్ను తిరిగి పొందాడనే వార్త అతడి అభిమానులను సంతోషపరుస్తోంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ దాదాపు 20 కిలోల బరువు తగ్గాడని తెలుస్తోంది. 95 కిలోల నుంచి 75 కిలోలకు చేరాడని సమాచారం. ఇటీవల రోహిత్ శర్మ బయట కనిపించిన వీడియో వైరల్ గా మారింది.
After doing workout???. pic.twitter.com/tTEfNatz5V
— viralTwich (@SauravJoshi0211) September 2, 2025
ఈ సందర్భంగా రోహిత్ శర్మ ఫిట్నెస్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జట్టు నుంచి తనను తొలగిస్తున్నారనే వార్తల నేపథ్యంలో రోహిత్ శర్మ కసరత్తులు చేస్తున్నారని.. తనను తాను పూర్తిగా మారేందుకు కష్టపడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. తిరిగి ఫిట్‌గా మారి రెండేళ్ల తర్వాత రానున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనే తపనతో రోహిత్ ఉన్నట్లు కనిపిస్తోంది. మరి అప్పటివరకు రోహిత్ శర్మ ఇదే ఫిట్నెస్తో ఉంటారా? మధ్యలోనే బీసీసీఐ వేటు వేస్తుందా? అని రాబోయే కాలంలో తెలుస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.