)
Rohit Sharma Ex Lover Sofia Hayat: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఏ వార్త అయినా ఇట్టే వైరల్ అవుతుంది. అతను దాదాపు 18 సంవత్సరాలుగా భారత జట్టులో ఉన్నాడు. అతని ఆటకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ, ఆయన కెరీర్ ఆరంభంలో ఓ అమ్మాయితో ప్రేమాయణం సాగించాడని మీకు తెలుసా? ఆయన భార్య రితిక అయితే కాదు. బ్రిటీష్ కు చెందిన సోఫియా హయత్ అనే అమ్మాయితో ప్రేమాయణం సాగించినట్లు సమాచారం. ఈమెతో లండన్‌లో రోహిత్ శర్మ చట్టాపట్టాలేసుకొని తిరిగాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. టీమ్ఇండియా జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో రోహిత శర్మ.. ఈ బ్రిటీష్ మోడల్లో పబ్‌ల్లో డ్యాన్స్ లు వేసి హ్యాంగ్అవుట్ అయ్యాడని లండన్ వార్తాపత్రికలు రాసుకొచ్చాయి.
విరాట్ కోహ్లీ తర్వాత నాయకత్వ పగ్గాలు తీసుకున్న రోహిత్ శర్మ.. 2024 T20 ప్రపంచ కప్, ఈ సంవత్సరం ప్రారంభంలో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టును విజయపథంలో నడిపించి, భారతదేశం గర్వపడేలా చేశాడు. 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు రోహిత్ శర్మ. గత మే నెలలో టెస్ట్ క్రికెట్ నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ శర్మ ఇప్పుడు వన్డే క్రికెట్ మాత్రమే ఆడటం కొనసాగించాలని ప్లాన్ లో ఉన్నాడు. అదే విధంగా రాబోయే వన్డే ప్రపంచకప్ తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని సమాచారం. ఇదే విధంగా విరాట్ కోహ్లీ కూడా వచ్చే ప్రపంచకప్ ను టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వీరిద్దరూ వచ్చే వరల్డ్ కప్ టోర్నీ తర్వాత క్రికెట్ కు వీడ్కోలు పలికే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఐపీఎల్ తర్వాత వీరిద్దరూ ఏ టోర్నీలోనూ పాలుపంచుకోలేదు. అక్టోబరులో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌లో వీరిద్దరూ ఆడే అవకాశం ఉంది.
అయితే రోహిత్ శర్మ గురించి ఓ వ్యక్తిగత రూమర్ ఒకటి తాజాగా ట్రెండ్ అవుతోంది. రోహిత్ శర్మ.. రితికాను వివాహం చేసుకునే ముందు ఒక బ్రిటిష్ నటితో డేటింగ్ చేసినట్లు సమాచారం.అది నిజమేనా? ఆ నటి ఎవరో ఇక్కడ చూద్దాం. గతంలో రోహిత్ శర్మ సోఫియా హయత్ తో ప్రేమలో పడ్డాడని రూమర్ వచ్చింది. రోహిత్ శర్మ దీని గురించి ఎక్కడా మాట్లాడలేదు. అయితే, సోఫియా హయత్ ఈ విషయం గురించి మాట్లాడింది.
ఇదే విషయంపై రోహిత్ శర్మ మాజీ ప్రేయసి సోఫియా హయత్ మాట్లాడుతూ.. "అవును, ఆ వార్తలు నిజమే. నేను అతన్ని లండన్‌లోని ఒక క్లబ్లో కలిశాను. నేను నటించిన సినిమా ముగింపు వేడుకల్లోనూ అతను పాల్గొన్నాడు. నేను డ్యాన్స్ చేస్తున్నప్పుడు, ఆ సినిమా సెట్లో ఉన్న నా స్నేహితుడు మమ్మల్ని పరిచయం చేశాడు. నేను క్రికెట్ ఎక్కువగా చూడను కాబట్టి నాకు అతన్ని గుర్తుపట్టలేకపోయాను. ఏమైనా, మేము ఒకరితో ఒకరు మాట్లాడుకుని, క్లబ్‌లోని ఏకాంత రూమ్‌కి వెళ్లాం. అక్కడ అతను నన్ను ముద్దు పెట్టుకున్నాడు" అని ఆరోపించింది.
"అంతే కాకుండా మేము కలిసి డ్యాన్స్ చేసాము. 4 రోజుల తర్వాత అతను నాతో మా ఇంట్లో ఉండటానికి వచ్చాడు. అతను అకస్మాత్తుగా మీడియాతో మాట్లాడి, నేను అతని అభిమానిని మాత్రమే అని చెప్పినప్పుడు ఇదంతా ప్రారంభమైంది. అది నాకు చాలా బాధగా ఉంది. అతనితో బ్రేకప్ అవ్వడం. నేను అతనికి ఓ మెసేజ్ పెట్టాను. నేను నీ అభిమానిని కాదు. నేను నిన్ను ఇక చూడాలనుకోవడం లేదు. నువ్వు చేసిన పని చాలా అసహ్యంగా ఉంది. దీంతో అతనితో సంబంధాలు అన్నీ తెంచుకున్నాను. అతడ్ని చూడాలని కూడా అనుకోవడం లేదు. ట్విట్టర్లో బ్లాక్ చేశాను" అని సోఫియా హయత్ గతంలో చెప్పింది. ఈ తంతు తర్వాత రోహిత్ శర్మ 2015లో రితికా సజ్దేహ్ను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook