)
Rohit Sharma Sensational Comments: టీమిండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను, విరాట్ కోహ్లీ మళ్లీ ఆస్ట్రేలియా పర్యటనకు వస్తామో రామోనని అన్నాడు. ఏదీ ఏమైనప్పటికి ఆసీస్ గడ్డపై ఆడిన ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదించామని చెప్పుకొచ్చాడు. సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్ శర్మ ఈ కామెంట్స్ చేశాడు.
మూడో వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ(121 నాటౌట్ 125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో ) శతకంతో చెలరేగాడు. అతడితో పాటు విరాట్ కోహ్లీ (74 నాటౌట్ 81 బంతుల్లో 7 ఫోర్లు) అజేయ అర్థశతకంతో రాణించాడు. హిట్ మ్యాన్ భారత విజయంలో కీలక పాత్ర పోషించడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అలాగే సిరీస్ మొత్తం రాణించడంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సైతం రోహిత్ శర్మ గెలుచుకున్నాడు.
ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తాను ఆస్ట్రేలియా పర్యటనకు రావడాన్ని ఎప్పుడూ ఇష్టపడతానని అన్నాడు. ఇక స్నిడీలో మ్యాచ్‌లు ఆడటాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తానని చెప్పుకొచ్చాడు. 2008లో తాను తొలిసారి ఆసీస్ పర్యటనకు వచ్చానని, నాటి జ్ఞాపకాలు మరిచిపోలేనన్నాడు. ఈ పర్యటన కూడా ఎంతో సరదాగా ఉందన్నాడు. తాము (కోహ్లీ, రోహిత్) క్రికెటర్లుగా మళ్లీ ఆసీస్ పర్యటనకు వస్తామో లేదో తనకు తెలియదన్నాడు. ఏదీ ఏమైనప్పటికి కూడా తాను ఇక్కడ ఆడిన ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదించానని తెలిపాడు. ఆసీస్ గడ్డపై ఆడడం తనకు ఎల్లప్పుడూ ఇష్టమేనని, కోహ్లీకి కూడా ఇలాగే ఉంటుందని తాను భావిస్తున్నట్లుగా చెప్పాడు.
ఇక ఈ సిరీస్‌లో మ్యాచ్‌లో రాణించడంపై మాట్లాడుతూ.. ఆసీస్‌లో రాణించడం అంత సులువు కాదన్నాడు. గత కొన్నాళ్లుగా తాను ఎక్కువగా మ్యాచ్‌లు ఆడలేదని, అయినప్పటికి కూడా ఈ సిరీస్ కోసం ఎంతో సన్నద్ధత అయినట్లుగా వివరించాడు. ఇక సిరీస్ గెలవలేకపోయినప్పటికి కూడా ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయన్నాడు. ఈ పర్యటన ద్వారా యువ ఆటగాళ్లు ఎంతో అనుభవాన్ని పొందారని చెప్పాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి