IPL 2025 Live: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఎదురైన పరాభవం రాజస్థాన్ రాయల్స్ చేతుల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎదురైంది. గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్ ప్రేక్షకులను నరాలు తెగేంత ఉత్కంఠ కలిగించింది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో చెన్నై జట్టు పోరాడి ఓటమి వైపు నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ బరిలోకి దిగినా కూడా జట్టును పరాజయం నుంచి తప్పించలేకపోయారు. ఫలితంగా 6 పరుగుల తేడాతో సీఎస్కేపై రాజస్థాన్ విజయం సాధించింది.
Also Read: IPL 2025: ఢిల్లీ చేతుల్లో చిత్తుగా ఓడిన ఆరెంజ్ ఆర్మీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఏమైంది?
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. నితీశ్ రానా అద్భుతంగా బ్యాటింగ్ చేసి 36 బంతుల్లో 81 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ (37), కెప్టెన్ సంజూ శామ్‌సన్ (20) మోస్తరు పరుగులు చేశారు. రాజస్థాన్ బ్యాటర్లను చెన్నై బౌలర్లు చక్కగా నియంత్రించారు. మతీశ పతిరణ చక్కటి బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
Also Read: SRH vs LSG Highlights: సన్‌రైజర్స్‌కు లక్నో భారీ షాక్.. ఉప్పల్‌లో ఆరెంజ్ ఆర్మీకి ఎదురుదెబ్బ
సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో చెన్నై సూపర్ కింగ్స్ తడబడింది. నిర్ణీత ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసి ఓటమిని ఖరారు చేసుకుంది. రుతురాజ్ గైక్వాడ్ 44 బంతుల్లో 63 పరుగులు చేసి విజయ కోసం తీవ్రంగా పోరాడాడు. రవీంద్ర జడేజా (22*), రాహుల్ త్రిపాఠి (23) తలా కొంత పరుగులు చేశారు. వహింద్ హసరంగ తన బౌలింగ్‌తో తగ్గేదేలే అని నిరూపించాడు. కీలకమైన నాలుగు వికెట్లు తీసి అదరగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ తలా ఒక వికెట్ తీశారు.
ధోనీ పోరాడినా..
బెంగళూరు చేతిలో ఓటమి అనంతరం రాజస్థాన్ రాయల్స్‌తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. సాధారణ లక్ష్యమైనా ఛేదించడానికి తడబడింది. ఆఖరి 15 ఓవర్లకు ఓటమి ఖరారు చేసుకున్నా కూడా విజయం కోసం బ్యాటర్లు తీవ్రంగా శ్రమించారు. చివరికి సీనియర్ ఆటగాడు ధోని రంగంలోకి దిగి పరుగులు చేశాడు. 11 బంతుల్లో 16 పరుగులు చేసి ధోనీ ఔటయ్యాడు. ధోనీ ఇంకా క్రీజులో ఉంటే విజయం పక్కా ఉండేదని చెన్నై అభిమానులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









