RR vs CSK: చెన్నైపై సూపర్ విక్టరీ.. పట్టికలో రెండో స్థానానికి చేరిన రాజస్థాన్! క్వాలిఫైర్ 1లో గుజరాత్‌తో ఢీ

RR vs CSK, IPL 2022: Rajasthan Royals meet Gujarat Titans in Qualifier 1. ఐపీఎల్ 2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్  అద్భుత విజయం సాధించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 11:32 PM IST
  • చెన్నైపై సూపర్ విక్టరీ
  • పట్టికలో రెండో స్థానానికి చేరిన రాజస్థాన్
  • క్వాలిఫైర్ 1లో గుజరాత్ టైటాన్స్‌తో ఢీ
RR vs CSK: చెన్నైపై సూపర్ విక్టరీ.. పట్టికలో రెండో స్థానానికి చేరిన రాజస్థాన్! క్వాలిఫైర్ 1లో గుజరాత్‌తో ఢీ

Rajasthan Royals meet Gujarat Titans in Qualifier 1: ఐపీఎల్ 2022లో భాగంగా శుక్రవారం రాత్రి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్  అద్భుత విజయం సాధించింది. చెన్నై నిర్ధేశించిన 151 పరుగుల లక్ష్య ఛేదనను మరో రెండు బంతులు ఉండగానే ఛేదించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (59; 44 బంతుల్లో 8x4, 1x6) హాఫ్ సెంచరీ బాదగా.. రవిచంద్రన్ అశ్విన్  (40; 23 బంతుల్లో 2x4, 3x6) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై బౌలర్ ప్రశాంత్ సోలంకి రెండు వికెట్లు పడగొట్టాడు. 

మోస్తరు లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ ఐదు వికెట్లను కోల్పోయి 19.4 ఓవర్లలో 151 పరుగులు చేసి విజయం సాధించింది. ఛేదనలో ఓవైపు యశస్వి జైస్వాల్ క్రీజులో నిలబడ్డా.. మిగతా బ్యాటర్లు వరుసగా ఔట్ అయ్యారు. జోస్ బట్లర్ (2), సంజూ శాంసన్ (15), దేవదుత్ పడిక్కల్ (3), శిమ్రాన్ హెట్‌మయేర్ (6) పరుగులు చేశారు. దాంతో రాజస్థాన్ విజయంపై నమ్మకం లేకపోయింది. ఈ సమయంలో రవిచంద్రన్ అశ్విన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడి జట్టును ఊహించని విజయాన్ని అందించాడు. అతడికి రియాన్‌ పరాగ్ (10 నాటౌట్) అండగా నిలిచాడు. చెన్నై బౌలర్లలో ప్రశాంత్ సోలంకి 2 వికెట్లు పడగొట్టాడు.

రాజస్థాన్‌ రాయల్స్ ఐపీఎల్ 2022 లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లు ఆడి 9 విజయాలు సాధించి 18 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. దాంతో పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఇక క్వాలిఫైర్ 1లో గుజరాత్‌తో ఢీ కొట్టనుంది. క్వాలిఫైర్ 1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. ఓడిన జట్టుకు క్వాలిఫైర్ 2 రూపంలో ఇంకో అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ ఓటమితో చెన్నై ఇంటిముఖం పట్టింది. చెన్నై 14 మ్యాచుల్లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే అందుకుంది.  

అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ మొయిన్ అలీ (93; 57 బంతుల్లో 13x4, 3x6) తృటిలో సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. కెప్టెన్ ఎంఎస్ ధోనీ (26; 28 బంతుల్లో 1x4, 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రుతరాజ్ గైక్వాడ్ (2), డెవాన్ కాన్వే (16), ఎన్ జగదీశన్ (1), అంబటి రాయుడు (3) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో ఒబెడ్ మెక్కాయ్, యుజ్వేంద్ర చహల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Also Read: Allu Arjun Dowry: అ‍ల్లు అర్జున్‌ ఎంత కట్నం తీసుకున్నారంటే.. అసలు విషయం చెప్పేసిన స్నేహా రెడ్డి తండ్రి!

Also Read: Pooja Hegde Cannes 2022 Pics: కేన్స్‌లో పూజా హెగ్దే హల్చల్.. సన్‌సెట్‌లో బుట్టబొమ్మ అందాల విందు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News