)
Champions Trophy: ఐసీసీ ట్రోఫీ ఒక్కటైనా సాధించాలనే కసితో ఉన్న దక్షిణాఫ్రికాకు మరోసారి అవకాశం చేజారింది. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన దక్షిణాఫ్రికా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలిగింది. టీ20 ప్రపంచకప్‌లో భారత్ ట్రోఫీ ఎగురేసుకుపోగా.. ఛాంపియన్స్ ట్రోఫీ కల సాధ్యమవుతుందని భావించగా.. న్యూజిలాండ్ చేతిలో భంగపాటు ఎదురైంది. ఐసీసీ ట్రోఫీకి రెండడుగుల దూరంలోనే నిలిచిపోయింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ 2లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలోనే న్యూజిలాండ్ అత్యధిక స్కోర్ నమోదు చేయగా లక్ష్యం సాధించలేక సఫారీలు పరాజయం బాట పట్టారు. అద్భుత విజయంతో ఫైనల్లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ ఆదివారం భారత్‌తో తలపడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్‌తో కివీస్ అమీతుమీ తేల్చకోనుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 364 పరుగులు సాధించి సరికొత్త రికార్డును నమోదు చేసింది. రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) అద్భుతంగా ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించారు. రెండో వికెట్‌కు 164 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మిచెల్ (49), ఫిలిప్స్ (49*) పర్వాలేదనిపించగా.. విల్ యంగ్, బ్రేస్‌వెల్, లేథమ్, శాంట్నర్ కొద్దిగా స్కోర్నమోదు చేశారు. కివీస్ బ్యాటర్లను సఫారీలు నిలువరించలేకపోయారు. లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీసినా కివీస్ భారీ స్కోర్‌కు తెరపడలేదు. రబాడా రెండు, ముల్డర్ ఒక వికెట్ తీశారు.
కొండంత లక్ష్యాన్ని చూసి దక్షిణాఫ్రికా ఆటగాళ్లు బెదరలేదు. లక్ష్యం చేధించేందుకు చివరి వరకు తీవ్రంగా పోరాడారు. నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసి మ్యాచ్‌ను చేజార్చుకుంది. డేవిడ్ మిల్లర్ ఫాస్టెస్ట్ శతకంతో ఆఖరి బంతి వరకు పోరాడాడు. 67 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో విజయం కోసం చెలరేగి ఆడాడు.
వాండర్ డసెన్ (69), కెప్టెన్ బౌవుమా (56), మార్క్రమ్ (31)తో పర్వాలేదనిపించగా మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేదు. బ్యాటర్లు చేసిన భారీ స్కోర్‌ను కివీస్ బౌలర్లు ఒక దశలో చేజారుతుందేమననే ఆందోళన నెలకొంది. చివరకు కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి సఫారీల ఆట కట్టించారు. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టగా.. గ్లెన్ ఫిలిప్స్, హెన్రీ తలా రెండు వికెట్లు తీయగా.. బ్రేస్‌వెల్, రవీంద్ర చెరో వికెట్ తీశారు.
icc cricket last one year South Africa has been the most unfortunate team in the world, having lost all the finals or semi-finals, be it men or women.#NZvsSA #ChampionsTrophy2025 #SemiFinal2
#SAvsNZ pic.twitter.com/5iGrVguN4o
— आदित्य यादव (@YadavAditya01) March 5, 2025
Miller literally call out the colour quota system that is literally ruining the cricket in South Africa even after being one of the best team of the tournament ?
David Miller celebrated his hundred even after losing against New Zealand was the sign of it pic.twitter.com/dA5nDhTTtK
— Bruce Wayne (@_Bruce__007) March 5, 2025
? MATCH RESULT ?
A well-contested game; unfortunate to be on the wrong side of the result. It's been quite a wonderful campaign for our Proteas in this year's ICC #Champions Trophy ????.#WozaNawe #BePartOfIt #ChampionsTrophy #NZvSA pic.twitter.com/dwDSPsch3a
— Proteas Men (@ProteasMenCSA) March 5, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి