Shikhar Dhawan's love story: రోహిత్ రూమ్‎లో ఉన్నాడు..అదే టైమ్‎లో నా గర్ల్ ఫ్రెండ్‎ని తీసుకెళ్లా.. సంచలన విషయం బయటపెట్టిన స్టార్ క్రికెటర్..!!

Shikhar Dhawan's Book: భారత మాజీ జట్టు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన వ్యక్తిగత జీవితంపై ఒక పుస్తకం రాశారు. 'ది వన్: క్రికెట్.. మై లైఫ్ అండ్ మోర్' అనే పుస్తకంలో అభిమానులకు ఇప్పటికీ తెలియని అనేక విషయాలను ఆయన వెల్లడించారు. అలాంటి ఒక విషయాన్ని వెల్లడిస్తూ.. ధావన్ తన పుస్తకంలో 2006లో తాను ఒక విదేశీ అమ్మాయితో ప్రేమలో పడ్డానని, దాని కారణంగా తన ఆటతీరు కూడా ప్రభావితమైందని రాశారు.  

Written by - Bhoomi | Last Updated : Jun 28, 2025, 12:56 PM IST
Shikhar Dhawan's love story: రోహిత్ రూమ్‎లో ఉన్నాడు..అదే టైమ్‎లో నా గర్ల్ ఫ్రెండ్‎ని తీసుకెళ్లా.. సంచలన విషయం బయటపెట్టిన స్టార్ క్రికెటర్..!!

Shikhar Dhawan's Book: టీమిండియాకు ఓపెనర్ గా సుదీర్ఘకాలం పాటు సేవలందించిన శిఖర్ ధావన్ తన ఆటకు మించిన ప్రేమకథను తాజాగా బయటపెట్టాడు. తన ఆటోబయోగ్రఫీ పుస్తకంలో 2006లో ఇండియా ఏ టీమ్ తో ఆస్ట్రేలియా టూర్ లో జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ధావన్ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మతో రూమ్ షేర్ చేస్తూ ఓ అమ్మాయిని రహస్యంగా రూమ్ లోకి తీసుకురావడం, ఆ తర్వాత రోహిత్ రియాక్షన్ గురించి పుస్తకంలో ప్రస్తావించాడు శిఖర్ ధావన్. 

Add Zee News as a Preferred Source

ఆ పర్యటనలో ఓ మహిళతో పరిచయం పెరిగి..ఆమెనే తన జీవిత భాగస్వామిగా భావించానని ధావన్ తెలిపాడు. ఆమె చాలా అందంగా ఉండేదని..ఒక్కసారిగా మళ్లీ ప్రేమలో పడిపోయినట్లు అనిపించిందని..ఆమెనే నేను పెళ్లి చేసుకుంటానని నమ్మినట్లు చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచ్ ల మధ్య ఖాళీ సమయంలో ఆమెతో గడిపిన సమయాన్ని ధావన్ తీపిగానే గుర్తు చేసుకున్నాడు. ఆమెను ఎలెన్ అంటూ పిలిచేవాడిని గుర్తు చేసుకున్నాడు. 

ఆ పర్యటనలో ధావన్ రోహిత్ ఒకే రూమ్ షఏర్ చేసుకున్నట్లు చెప్పాడు. ఆమెను తరుచూ రూమ్ కు తీసుకురావడంతో రూమ్ మేట్ రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేస్తున్నట్లుచెప్పాడు. రాత్రిళ్లు నిద్రలేకపోవడంతో నన్ను నిద్రపోరిస్తావా అంటూ హిందీలో అనేవాడని చెప్పాడు. తమ మధ్య ప్రేమ విషయాన్ని ఎవరికీ తెలియకుండా ఉంచాలని ధావన్ జాగ్రత్తలు తీసుకున్నా చివరికి అది టీమ్ కు తెలిసిపోయిందట. 

Also Read: Gold Rate Today: కలా..నిజమా..43వేలకుపైగా తగ్గిన పసిడి..కొనేందుకు ఇదే మంచి సమయం..!!

ఒక్కరోజు రాత్రి ఎలెన్ తో హోటల్ కు డిన్నర్ కు వెళ్లినప్పుడు ఇద్దరూ చేతులు పట్టుకుని నడుస్తుండగా..అదే హోటల్లో ఉన్న సీనియర్ సెలక్టర్ చూసి షాక్ అయ్యాడని చెప్పాడు. అతని ద్వారా మొత్తం టీమ్ లో ఈ విషయం వైరల్ అయ్యిందని ధావన్ చెప్పుకొచ్చాడు. అయితే అప్పట్లో తనకు తప్పు చేసినట్లు అనిపించలేదన్నాడు. ఆ ప్రేమ వ్యవహారమే తన ఆటపైన కూడా ప్రభావం చూపించిందని ధావన్ అంగీకరించాడు. ఆ టూర్ లో మొదటిసారి హాఫ్ సెంచరీ చేయడం నుంచి మంచి ఫామ్ లో ఉన్నా తర్వాత ఫోకస్ వదలేసి ప్రేమలో ముగిపోయాను. మంచి ప్రదర్శన కనబరిచి ఉంటే చాలా తొందరగా భారత జట్టులోకి ఛాన్స్ వచ్చేది అని చెప్పాడు. 

Also Read: Salt-powered scooters: "ఉప్పు"తో నడిచే స్కూటర్లు వచ్చాయి..పెట్రోల్ నింపే టెన్షన్ పోయినట్లేనా?  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News