)
Ind Vs Aus 3rd Odi Shreyas Iyer Injury: భారత్‌తో సిడ్నిలో జరిగిన మూడవ వన్డేలో ఆస్ట్రేలియా పరుగుల వరద పారించే సిడ్నీ పిచ్‌పై భారీ స్కోర్ చేయాలని డిసైడ్ అయ్యి బ్యాటింగ్‌కి దిగింది. మొదట ఓపెనర్లు శుభారంభం అందించినా.. మిడిల్ ఓవర్లలో భారత బౌలర్లు రాణించడంతో సీన్ రివర్స్ అయింది. అయితే బ్యాటర్ అలెక్స్ క్యారీ క్యాచ్‌ని అందుకొని శ్రేయాస్ అయ్యర్ మ్యాచ్‌ని మలుపు తిప్పాడు.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ 34వ ఓవర్‌ను హర్షిత్ రాణా వేశాడు. ఈ ఓవర్లోని నాలుగో బంతికి ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ కారీ (24) షాట్ ఆడగా మిస్ టైమింగ్ కావడంతో బంతి గాల్లోకి లేచింది. బ్యాక్వార్డ్ పాయింట్లో ఉన్న శ్రేయాస్ అయ్యర్.. తన వెనక్కి పరిగెతుడూ డైవ్ చేస్తూ చక్కని క్యాచ్ అందుకున్నాడు. ఈ క్రమంలో అతడి ఎడమచేయి బలంగా భూమిని తాకింది. అదే సమయంలో అతడి ఎడమమోచేయి బలంగా అతడి పక్కటెముకలపై గుచ్చుకున్నట్లుగా కనిపించింది.
A STUNNER FROM VICE CAPTAIN SHREYAS IYER. ? pic.twitter.com/zY5ENqGg6D
— Johns. (@CricCrazyJohns) October 25, 2025
వెంటనే అతడు తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఫిజియో గ్రౌండ్లోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించాడు. అయినప్పటికి నొప్పి తగ్గకపోవడంతో శ్రేయాస్ గ్రౌండ్ నుండి వెళ్లిపోయాడు. బయటకు వెళ్లే సమయంలో కూడా నడవలేని పరిస్థితిలో పక్కన సపోర్ట్ తీసుకుని మరీ వెళ్లాడు. దాంతో బ్యాటింగ్ చేయడానికి వస్తాడో.. లేదో.. అన్న సందేహం మొదలైంది.
శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్‌కు రాకపోతే..
ఒకవేళ శ్రేయాస్ అయ్యర్ గాయం తీవ్రమై.. అతడు బ్యాటింగ్ చేయలేని పరిస్థితి ఉంటే అది భారత్‌కు ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. ఐసీసీ నిబంధనల ప్రకారం అతడి స్థానంలో మరో ఆటగాడు బ్యాటింగ్ చేసేందుకు వీలులేదు. అప్పుడు టీమిండియా 9 వికెట్లు కోల్పోతే ఆలౌట్గానే పరిగణిస్తారు. కేవలం కంకషన్‌కు (తలకు దెబ్బతగిలిన సందర్భంలో) గురైన సందర్భంలో మాత్రమే ఒక ఆటగాడి స్థానంలో మరో ఆటగాడు ఆడొచ్చు.
ఇక హర్షిత్ రాణా ఓవర్‌కి ముందే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ క్యాచ్ డ్రాప్ అయింది. లెగ్ సైడ్ స్ట్రయిట్‌గా ఇచ్చిన క్యాచ్‌ని ప్రసిద్ధ్ కృష్ణ వదిలేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే హర్షిత్ రాణా బౌలింగ్‌లో క్యారీ అవుటయ్యాడు. 37 బంతులు ఆడిన క్యారీ 24 పరుగులు చేశాడు. 183 పరుగుల వద్ద క్యారీ అవుటవ్వగా.. ఆ వెంటనే ఆస్ట్రేలియా మరో మూడు వికెట్లు కోల్పోయింది. కేవలం 18 పరుగుల తేడాతో ఆసీస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోవడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి