Shreyas Iyer: నాకు తగిన గుర్తింపు రాలేదు.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

Shreyas Iyer Comments on KKR: ఐపీఎల్ 2024 సీజన్‌లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. అయితే తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదంటూ అయ్యర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. మన ప్రయత్నాలు కొన్నిసార్లు గుర్తింపు పొందకపోవచ్చన్నాడు.  

Written by - Ashok Krindinti | Last Updated : Mar 11, 2025, 10:16 PM IST
Shreyas Iyer: నాకు తగిన గుర్తింపు రాలేదు.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

Shreyas Iyer Comments on KKR: టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో శ్రేయాస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. 5 మ్యాచ్‌ల్లో 60.75 సగటుతో 243 పరుగులు చేసి.. ఈ టోర్నీలో టాప్ భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా రచిన్ రవీంద్ర (263) తరువాతి స్థానంలో ఉన్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ వస్తూ.. జట్టును కష్టాల్లో ఉన్నప్పుడు గెలుపు అంచుల వైపు నడిపించాడు. ముఖ్యంగా సెమీస్‌లో ఆసీస్‌పై, ఫైనల్‌లో కివీస్‌పై అయ్యర్ గొప్ప ఆటతీరు కనబర్చాడు. మరో వికెట్ పడితే గెలుపు తమదే అని భావించిన ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొంటూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లేకపోయినా.. ఈ ట్రోఫీకి ముందు తుది జట్టులో చోటు గ్యారంటీ లేకపోయినా ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తనదైన శైలిలో దూసుకువచ్చి దుమ్ములేపాడు శ్రేయాస్ అయ్యర్.

Add Zee News as a Preferred Source

ఈ సారి ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌ జట్టు తరఫున శ్రేయాస్ అయ్యర్ బరిలోకి దిగుతున్నాడు. వేలంలో అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. గతేడాది వరకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అయ్యర్.. గత సీజన్‌లో టీమ్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. అయితే వేలంలో అయ్యర్‌ను కొనుగోలు చేసేందుకు కేకేఆర్ ఆసక్తి చూపించలేదు. ఈ నేపథ్యంలోనే ఈ సైలెంట్ హీరో సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత సీజన్‌లో కోల్‌కతాకు టైటిల్ సాధించి పెట్టినా తనకు సరైన గుర్తింపు దక్కలేదన్నాడు.

కొన్నిసార్లు మనం ఎంత కష్టపడ్డా వృథాగా మారుతుందన్నాడు. భారత టెస్ట్‌ జట్టు చోటు కోల్పోవడం, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తొలగించినప్పుడు ఎంతో బాధపడ్డానని అన్నాడు. ఆ కష్టకాలంలో కొందరు మాత్రమే అండగా నిలిచారని.. తనను నిరూపించుకునేందుకు అన్ని విధాలా సిద్ధమయ్యానని చెప్పుకొచ్చాడు.

"2024లో కేకేఆర్‌కు టైటిల్ సాధించి పెట్టా. అయితే మన ప్రయత్నాలు కొన్నిసార్లు గుర్తింపు పొందకపోవచ్చు. నేను ఇలాంటి వాటిపై ఫిర్యాదు చేసే వ్యక్తిని కాదు. నాకు వస్తున్న విజయాలను ఆస్వాదిస్తా. నేను మైదానంలో చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు అది గుర్తింపులోకి రావు. కానీ నేను చేసే ప్రయత్నాలతో చాలా సంతృప్తి చెందాను. " అని శ్రేయాస్ అయ్యర్ చెప్పాడు.

వన్డే ఫార్మాట్‌లో అదరగొడుతున్న అయ్యర్.. ఇప్పుడు టెస్ట్ జట్టులోకి తిరిగి రావాలని చూస్తున్నాడు. 2024 ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్ సమయంలో అయ్యర్ జట్టులో చోటు కోల్పోయాడు. 2024-25 రంజీ ట్రోఫీ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసినా.. అయ్యర్‌కు సెలెక్టర్ల నుంచి పిలుపురాలేదు.

టెస్ట్ టీమ్‌లోకి మళ్లీ రావాలని ఉందని.. వీలైనంత ఎక్కువగా ఆడాలనుకుంటున్నానని చెప్పాడు శ్రేయాస్. తాను దేశీయ టోర్నమెంట్లలో బాగా రాణించానని.. కానీ ఏమి జరుగుతుందో చూద్దామన్నారు. భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచించడం ఇష్టం లేదని.. ఎంత ఎక్కువగా ఆలోచిస్తే.. మనసుపై అంత ఎక్కువ భారం పడుతుందన్నారు. తాను ప్రస్తుత క్షణంలో జీవిస్తానని.. మ్యాచ్ వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తానని చెప్పుకొచ్చాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. 

Also Read: Chandrababu: ప్రేమ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తే తాట తీస్తా: సీఎం చంద్రబాబు హెచ్చరిక

Also Read: YS Jagan: ఆ వైపు ముగ్గురు..ఈ వైపు జగన్ ఒక్కడే... ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్న హీరో సుమన్ కామెంట్స్..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News