)
BCCI Selection Committee: భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న శుభమన్ గిల్‌కు మరో ప్రమోషన్ రాబోతున్నదని తెలుస్తోంది. భారత జట్టు యువరాజుగా పేరు పొందిన గిల్‌కు మరో కీలక బాధ్యత లభించనుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. భారత జట్టు త్వరలో ఆసియాకప్ టీ20 సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి బీసీసీఐ మంగళవారం జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. అయితే కెప్టెన్ విషయంలో కీలక ప్రకటన తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
టెస్ట్ జట్టు కెప్టెన్ శుభమన్ గిల్‌ను ఎంపిక చేస్తారని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గిల్ విజయవంతంగా జట్టును నిలిపాడు. భావి భారత కెప్టెన్‌గా గుర్తింపు పొందుతున్నాడు. కాగా టీ20 టీమ్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. అతడి స్థానంలో యువ ఆటగాడు శుభమన్‌కు పదోన్నతి కల్పించే అవకాశం ఉంది. మూడు ఫార్మాట్లకు ఒకరే కెప్టెన్‌గా ఉండాలనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీ20 కెప్టెన్‌గా కూడా శుభమన్‌ను నియమించే అవకాశాలు ఉన్నాయి.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టులకు వీడ్కోలు పలికినప్పుడు తదుపరి కెప్టెన్ ఎవరు అనే దానిపై తీవ్ర కసరత్తు జరిగింది. సీనియర్ బౌలర్ బుమ్రా కెప్టెన్సీ నిరాకరించడంతో కేఎల్ రాహుల్ కెప్టెన్ అవుతాడని అంతా భావించారు. కానీ సెలక్షన్ కమిటీ శుబ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయడం అందరినీ విస్మయపరిచింది. భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని యువ నాయకత్వానికే బీసీసీఐ ప్రాధాన్యం ఇచ్చింది.
తన సారథ్యంలో ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు సంచలన ఫలితాలు అందుకుంది. కెప్టెన్‌గా.. ఆటగాడిగా గిల్ విజయవంతమయ్యాడు. అంచనాలకు మించి ఆడడంతో గిల్ సారథ్యంపై అన్నీ అనుమానాలు తొలగిపోయాయి. ఆటగాడి కంటే గిల్ నాయకత్వంపై అందరూ ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో వస్తున్న ఆసియా కప్ బాధ్యతలు కూడా గిల్‌కు అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
టెస్టు, టీ20, వన్డే మూడు ఫార్మాట్లకు ఒక్కరే కెప్టెన్ ఉంటే బాగుంటుందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వన్డే జట్టుకు రోహిత్ శర్మ, టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్, టెస్ట్ కెప్టెన్‌గా గిల్ కొనసాగుతున్నారు. రోహిత్, సూర్యకుమార్ యాదవ్‌కు వయసు మీరుతోంది. దీనికి తోడు వారి ప్రదర్శన కూడా అంతంత మాత్రమే ఉంది. జట్టులోకి తీసుకోకూడదని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు సూచించే స్థాయిలో వారి ప్రదర్శన ఉంది. ప్రస్తుతానికి టీ20 బాధ్యతలు ఇచ్చి తర్వాత వన్డేకు కొన్నాళ్ల తర్వాత ఇచ్చే యోచనలో బీసీసీఐ ఉందని తెలుస్తోంది. ఆసియా కప్‌కు సారథ్యం సూర్యకుమార్‌కే అప్పగించినా.. వైస్ కెప్టెన్‌గా శుభమన్ గిల్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇలా ప్రస్తుతానికి చర్చ జరుగుతుండగా.. రేపు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.