T20 World Cup 2024 Live Updates: ఇప్పుడు ఎక్కడ చూసిన టీ20 వరల్డ్ కప్ గురించి చర్చే. జూన్ 01 నుంచి ప్రారంభంకానున్న ఈ మెగాటోర్నీ కోసం జట్లన్నీ  సిద్దమవుతున్నాయి. బీసీసీఐ కూడా ఇటీవల 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. నలుగురిని రిజర్వ్ ప్లేయర్‌లుగా ప్రకటించారు. ఈసారి వరల్డ్ కప్ లో ఎక్కువగా యువ ఆటగాళ్లకు పెద్దపీట వేశారు సెలక్టర్లు. సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ కు చోటు దక్కలేదు. తొలిసారి ఆరుగురు ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ ఆడబోతున్నారు. వారెవరో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యశస్వి జైస్వాల్: భారత యువ హిట్టర్ యశస్వి జైస్వాల్ తొలిసారి టీ20 ప్రపంచపప్ ఆడబోతున్నాడు. 22 ఏళ్ల యశస్వి టీమిండియా తరపున 17 టీ20 మ్యాచ్‌లు ఆడి 161.93 స్ట్రైక్ రేట్‌తో 502 పరుగులు చేశాడు.
శివమ్ దూబే: ఐపీఎల్‌లో చెన్నై తరపున ఆల్ రౌండ్ షో ఆదరగొడుతున్న శివమ్ దూబే ఎట్టకేలకు టీమ్ లో చోటు దక్కించుకున్నాడు. శివమ్ భారత్ తరపున 21 టీ20 మ్యాచ్‌లు ఆడి 276 పరుగులు చేశాడు.
సంజు శాంసన్: రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడబోతున్నాడు. ఇప్పటివరకు 25 టీ20 మ్యాచ్‌లు ఆడి 133.09 స్ట్రైక్ రేట్‌తో 374 రన్స్ చేశాడు. 
మహ్మద్ సిరాజ్: హైదరాబాద్ పేసర్ సిరాజ్ కూడా ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ ఆడలేదు. భారత్ తరపున 10 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ మెుదటిసారి ప్రపంచకప్ ఆడబోతున్నాడు.  


Also Read: SRH vs RR Dream11 Team Prediction: సన్‌రైజర్స్ Vs రాజస్థాన్ బలాబలాలు, హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే.. డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!


కుల్దీప్ యాదవ్: టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఈ మెగా టోర్నీలో పాల్గొనబోతున్నాడు. భారత్ తరపున 35 మ్యాచ్‌లు ఆడిన 59 వికెట్లు పడగొట్టాడు. 
యుజువేంద్ర చాహల్: ఐపీఎల్‌లో చాహల్ దుమ్మురేపుతున్నాడు. తన స్పిన్ మాయజాలంతో ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. మన దేశం తరపున 80 మ్యాచ్‌లు ఆడిన చాహల్.. మెుదటిసారి టీ20 ప్రపంచకప్ ఆడబోతున్నాడు. 


Also Read: T20 World Cup 2024: ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు దూరం కానున్న ఆటగాళ్లు, ఆ ఫ్రాంచైజీల పరిస్థితేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook