)
Smriti Mandhana deletes all wedding related posts: స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ ల పెళ్లికి సంబంధించిన అనేక ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ ల పెళ్లి మహారాష్ట్రలోని సాంగ్లీలో చేయడానికి అన్నిరకాల ఏర్పాట్లు చేశారు . దీనిలో భాగంగా ప్రీవెడ్డింగ్ షూట్, సంగీత్, హల్దీలను ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. మరోవైపు పెళ్లి రోజు అంటే నిన్న (నవంబర్ 23) న ఉదయం కూడా కాబోయే భార్యభర్తలు ప్రీవెడ్డింగ్ ఫోటోషూట్ లో ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్మృతి మంధాన తండ్రిశ్రీనివాస్ మంధనకు నిన్న గుండెపోటురావడంతో ఆస్పత్రికి తరలించారు.
ముందుగా ఆయన కోలుకుంటే నిన్న పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఆయన కోలుకోలేని పరిస్థితుల ఉండటంతో పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. మరోవైపు ఈరోజుఉదయం పలాష్ ముచ్చల్ కూడా అస్వస్థతకు గురవ్వగా సన్నిహితులు ఆస్పత్రికి తరలించారు. పలాష్ కు వైద్యం అందించిన వైద్యులు ఆయనను డిశ్చార్జీ చేశారు.
ఈ పరిణామలతో స్మృతి మంధాన సన్నిహితులతో పాటు, ఆమె అభిమానులు కూడా బిగ్ షాక్ కు గురయ్యారు. మరోవైపు.. స్మృతి మంధాన పెళ్లి, నిశ్చితార్థంకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి డిలీట్ చేయడం ప్రస్తుతం రచ్చగా మారింది. అదే విధంగా స్మృతి మంధాన కొన్ని వీడియోలను తొలగించింది.
అదే విధంగా.. ఆమె స్నేహితులు జెమిమా రోడ్రిగ్స్, శ్రేయంకా పాటిల్ వంటి సన్నిహితులు, సహచరులు కూడా ప్రకటన వీడియోను తొలగించారు. కానీ.. ఇటీవల భారతదేశం ICC మహిళల ప్రపంచ కప్ 2025 విజయంలో కీలక పాత్ర పోషించిన నవీ ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో అతను స్మృతికి ప్రపోజ్ చేశాడు.
స్మృతి మంధాన తనను పలాష్ గ్రౌండ్ లో ప్రపోజ్ చేసిన వీడియోలను అలానే ఉంచారు. ఈ క్రమంలో ప్రస్తుతం స్మృతి మంధాన పెళ్లి, నిశ్చితార్థం పోటోలను డిలీట్ చేయడం కొత్త చర్చకు దారితీసింది. మరోవైపు.. కొంత మంది వీరి పెళ్లి ఆగిపోయిదని కూడా వార్తలు వైరల్ చేస్తున్నారు. దీనిపై అధికారికంగా స్మృతి మంధాన కుటుంబం ఎవరైన రియాక్ట్ అయితే ఒక క్లారిటీ వస్తుందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook