)
South Africa Defeat India by 408 Runs: భారత క్రికెట్ జట్టుకు టెస్టుల్లో మరో ఘోర ఓటమి ఎదురైంది. గతేడాది న్యూజిలాండ్ చేతిలో 0-3తో వైట్ వాష్ అయిన భారత జట్టు.. సరిగ్గా ఏడాది తర్వాత మరోసారి వైట్ వాష్ అయ్యింది. అయితే ఈసారి సౌతాఫ్రికా చేతిలో.. రెండో టెస్టులో ఘోరంగా ఓడింది. ఏకంగా 408 పరుగు తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది. ఈ క్రమంలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. కాగా భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇన్ని పరుగుల తేడాతో ఓడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలంటే చివరి రోజంతా క్రీజులో నిలవాల్సిన పరిస్థితిలో.. ఓవర్ నైట్ స్కోరు 27/2 తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌ను భారత్ కొనసాగించింది. అయితే మరో 113 పరుగులు జోడించి మిగిలిన 8 వికెట్లను కోల్పోయింది.
టీమిండియా బ్యాటర్లలో రవీంద్ర జడేజా (54 87 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. యశస్వి జైస్వాల్ (13), సాయి సుదర్శన్ (14), వాషింగ్టన్ (16) లు మినహా మిగిలిన అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్ ఆరు వికెట్లు తీశాడు. కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్, సేనురన్ ముత్తుసామిలు చెరో వికెట్ పడగొట్టారు.
మ్యాచ్ సంక్షిప్త స్కోరు..
* దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్-489 ఆలౌట్
* భారత తొలి ఇన్నింగ్స్-201 ఆలౌట్
* దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్-260 5 డిక్లేర్
* భారత్ రెండో ఇన్నింగ్స్-140 ఆలౌట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook