WTC FINAL 2025: సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు 27ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లయ్యింది. రెండున్నర దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు సఫారీల ఖాతాలో ఐసీసీ ట్రోఫీ చేరింది. లార్డ్స్ వేదికగా జరిగిన 2025 డబ్ల్యూటీసీ ఫైనల్లో నెగ్గిన సఫారీ జట్టు టెస్టు ఛాంపియన్ గా అవతరించింది. ఫైనల్లో ఆసీస్ ను ఢీకొట్టిన సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 282 పరుగుల ఛేదనలో ఎయిడెన్ మర్క్రమ్ అద్భుత సెంచరీతో సఫారీ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. కెప్టెన్ టెంబా బవుమా 66 పరుగులతో రాణించాడు.
ఇక సౌతాఫ్రికా చివరిసారి 1998లో ఐసీసీ టైటిల్ ను ముద్దాడింది. 1998 ఛాంపియన్స్ ట్రోఫీలో నెగ్గిన సౌతాఫ్రికా తొలిసారి ఐసీసీ టోర్నీ విజేతగా నిలిచింది. అప్పటి నుంచి టీ 20, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీల్లో ఆడినా ఓటమే ఎదురయ్యింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రెండో ట్రోఫీని దక్కించుకుంది సౌతాఫ్రికా.
ఈ మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ కు నిరాశ మిగిలింది. ఇందులో నెగ్గి వరుసగా రెండోవసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ అవ్వాలని భావించిన ఆస్ట్రేలియాకు భంగపాటే మిగిలింది. తొలి ఇన్నింగ్స్ లో రాణించినా, రెండో ఇన్నింగ్స్ లో బౌలర్లు సహకరించకపోవడం వల్ల ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు.
Also Read : Video: ఇజ్రాయెల్ మిస్సైల్ దాడులతో ఇరాన్‌కు చావుదెబ్బ.. ఆర్మీ కీలక నేతలు మృతి..
డబ్ల్యూటీసీ విజేతలు
న్యూజిలాండ్- 2021
ఆస్ట్రేలియా- 2023
సౌతాఫ్రికా- 2025
ఇరు జట్ల స్కోర్లు
Also Read : భగ్గుమంటున్న పశ్చిమాసియా.. మిస్సైల్ దాడితో తగలబడి పోతున్న ఎయిర్ పోర్టు..
ఆస్ట్రేలియా : 212 & 207
సౌతాఫ్రికా : 138 & 285/5 (83.4)
????????? ???
South Africa take home the ???? ?#WTC25 #SAvAUS pic.twitter.com/Yy4C4AQEO7
— ICC (@ICC) June 14, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









