David Miller Comments: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఓటమి అనంతరం ప్రోటీస్ జట్టు విధ్వంసకర ఆటగాడు డేవిడ్ మిల్లర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ షెడ్యూలింగ్ సరిగ్గా లేదని విమర్శలు ఎక్కుపెట్టాడు. గందరగోళపు షెడ్యూలింగ్ వల్లనే తాము ఓడిపోవల్సి వచ్చిందని వివరించడం చర్చనీయాంశంగా మారింది.
లాహోర్ వేదికగా మార్చ్ 5 బుధవారం జరిగిన రెండవ సెమీఫైనల్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. చోకర్స్ ముద్రను మరోసారి రుజువు చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రోటీస్ జట్టు ముందు ఉంచింది. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 9 వికెట్లు కోల్పోయి 312 పరుగులే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ ఆట విధ్వంసకరంగా మారింది. 67 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. టోర్నీలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ చేసినా లాభం లేకపోయింది.
సెమీస్‌కు ముందు షెడ్యూలింగ్ స్పష్టత లేకపోవడంతో దక్షిణాఫ్రికా జట్టుకు తీవ్రమైన ప్రయాణ భారం ఎదురైంది. ఎందుకంటే రెండవ సెమీఫైనల్ లాహోర్‌లో మార్చ్ 5న జరిగింది. కానీ రెండవ సెమీఫైనల్ ఎవరెవరి మధ్య అనేది కాకపోయినా ఎక్కడ అనేది అంతకు ముందు ఆదివారం జరిగిన కివీస్ వర్సెస్ ఇండియా మ్యాచ్ తరువాతే స్పష్టత వచ్చింది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో కివీస్ గెలిచి ఉంటే దక్షిణాఫ్రికా సెమీఫైనల్స్ ఇండియాతో దుబాయ్‌లో ఆడాల్సి వచ్చేది. ఒకవేళ అదే జరిగితే ఆలస్యం కాకూడదనే ఉద్దేశ్యంతో ప్రోటీస్ జట్టు ఆదివారం ఉదయానికే దుబాయ్ చేరుకుంది. ఎందుకంటే తొలి సెమీఫైనల్ దుబాయ్‌లో మంగళవారం అంటే మార్చ్ 4న ఉంది. కానీ ఆదివారం మ్యాచ్‌లో ఇండియా గెలవడంతో దక్షిణాఫ్రికా జట్టు తిరిగి పాకిస్తాన్ లాహోర్‌కు చేరాల్సి వచ్చింది.
ఇదంతా షెడ్యూలింగ్ గందరగోళం వల్ల జరిగిందని చెప్పుకొచ్చాడు. సెమీఫైనల్ చేరే జట్టుని బట్టి మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో షెడ్యూల్ చేయడం సరైంది కాదనేది డేవిడ్ మిల్లర్ అభిప్రాయం. అందుకే ప్రయాణ బడలిక, అలసట కారణంగా మ్యాచ్‌పై ఏకాగ్రత లోపించిందన్నాడు.
ఇక ఫైనల్‌లో తమ మద్దతు పూర్తిగా న్యూజిలాండ్ జట్టుకే ఉంటుందన్నాడు డేవిడ్ మిల్లర్. షెడ్యూలింగ్ లోపం కారణంగా ఈ టోర్నీలో ఇతర జట్లు కూడా ఇబ్బంది పడ్డాయి.
Also read: Heera Gold Scam: మూడు నెలల్లో 25 కోట్లు చెల్లించకుంటే మళ్లీ జైలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









