Unlucky South Africa: ఐసీసీ టోర్నీల్లో దక్షిణాఫ్రికాకు ఇంకా దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టేబుల్ టాపర్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా సెమీస్‌లో మరోసారి ఓడిపోయింది. సెమీస్‌లో ఓడిపోవడం షరా మామూలే అన్నట్టుగా కివీస్ చేతిలో పరాజయంతో ఇంటి దారిపట్టింది.
దక్షిణాఫ్రికాలో అగ్రశ్రేణి ఆటగాళ్లున్నారు. మ్యాచ్‌ను నిలబెట్టి నెగ్గించే సత్తా సామర్ధ్యం కలిగిన ప్లేయర్లు ఉన్నారు. అయినా ప్రతిసారీ అదే దురదృష్ఠం ఓటమి రూపంలో వెంటాడుతుంటుంది. లీగ్ దశ వరకూ అద్భుతంగా ఆడి ఆ తరువాత వెనుదిరగడం ఆ జట్టుకు అలవాటుగా మారింది. ఇప్పటి వరకూ ఐసీసీ వన్డే టోర్నీల్లో 10 సార్లు సెమీఫైనల్స్ ఆడిన ప్రోటీస్ జట్టు 9 సార్లు ఓడిపోయింది. సెమీస్‌లో ఎక్కువసార్లు ఓడిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ప్రతిసారీ భారీ అంచనాలతో అడుగు పెట్టడం ఆ తరువాత ఒత్తిడికి గురై ఓడిపోవడం సాధారణమైపోయింది.
దక్షిణాఫ్రికా పరాజయాల చిట్టా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 1998 తొలి ఎడిషన్ గెలిచిన దక్షిణాఫ్రికా ఆ తరువాత ఏ మెగా టోర్నీలోనూ విజయం సాధించలేదు. 2000, 2002 ఛాంపియన్స్ ట్రోఫీల్లో సెమీ ఫైనల్స్‌కు చేరినా రెండు సార్లు టీమ్ ఇండియా చేతిలో ఓడిపోయింది. 2006, 2013 సీజన్లలో కూడా సెమీస్‌లో అడుగుపెట్టి ఓడిపోయింది. ఇప్పుడు తాజాగా 2025లో కూడా సెమీస్ వరకూ టేబుల్ టాపర్గా నిలిచి న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది.
వన్డే ప్రపంచకప్‌లో కూడా దక్షిణాఫ్రికా పరిస్థితి ఇలానే ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిధ్యమిచ్చిన 1992 ప్రపంచకప్ వాస్తవానికి దక్షిణాఫ్రికాకు తొలి వరల్డ్ కప్. మొదటి ప్రయత్నంలోనే సెమీస్‌కు చేరింది. వర్షం కారణంగా ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. 1999 ప్రపంచకప్‌లో కూడా సెమీస్‌లో అడుగుపెట్టి ఆస్ట్రేలియాతో గెలవాల్సిన మ్యాచ్ను టై చేసుకుంది. రన్‌రేట్ ఆధారంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆ తరువాత 2007లో ఆస్ట్రేలియా చేతిలో, 2015లో న్యూజిలాండ్ చేతిలో ఇదే పరిస్థితి. 2015 సెమీఫైనల్ అయితే పూర్తిగా దక్షిణాఫ్రికా స్వయం కృతాపరాధం.
ఈ మ్యాచ్‌లో వర్షం కారణంగా 43 ఓవర్లకు మ్యాచ్ కుదించడంతో ప్రోటీస్ జట్టు నిర్ణీత 43 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం కివీస్ టార్గెట్ 298 అయింది. ఈ మ్యాచ్‌లో గ్రాంట్ ఇలియట్‌ను రన్ అవుట్ చేసే ఛాన్స్‌ను దక్షిణాఫ్రికా మిస్ చేసుకోవడంతో మ్యాచ్ చేజారిపోయింది. తాజాగా టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో కూడా ఓటమితో కంట తడిపెట్టుకున్న దృశ్యాలు ఇప్పటికీ క్రికెట్ అభిమానులు మర్చిపోలేరు.
Also read: BCCI New Rules: ఐపీఎల్ ఆటగాళ్లకు బిగ్ అలర్ట్, ఈ రూల్స్ పాటించాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









