Mayank Yadav Re Entry: ఐపీఎల్ 2025 ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. ఉత్కంఠభరిత మ్యాచ్‌లతో అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. హై స్కోరు మ్యాచ్‌లతోనే కాకుండా.. లో స్కోరింగ్ గేమ్‌లు కూడా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. ఇక ఈ సీజన్‌లో కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ నాయకత్వంలో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ పర్వాలేదనిపిస్తోంది. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడగా.. నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. 8 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన 7 మ్యాచ్‌ల్లో కచ్చితంగా 8 విజయాలు సాధించాలి. గత మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమి పాలైన పంత్ సేన.. ఈ నెల 19న రాజస్థాన్ రాయల్స్‌తో సెకండాఫ్ పోరు మొదలు పెట్టనుంది. ఈ నేపథ్యంలోనే 156.7 KMPH వేగంతో బౌలింగ్ చేసే ప్రమాదకరమైన భారత బౌలర్ జట్టులో చేరాడు.
టీమిండియా సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ లక్నో టీమ్‌లో చేరాడు. మయాంక్ రీఎంట్రీపై ఎల్‌ఎస్‌జీ అధికారికంగా వీడియో ద్వారా ప్రకటించింది. సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేస్తూ.. 'మయాంక్ యాదవ్ ఈజ్ బ్యాక్' అనే క్యాప్షన్‌లో ఇచ్చింది. మయాంక్ వెన్నునొప్పి కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఆ తరువాత కోలుకున్నా.. కాలి వేలికి మళ్లీ గాయం కావడం.. ఈ గాయం ఇన్‌ఫెక్షన్‌కు గురి కావడంతో రీఎంట్రీ మరింత ఆలస్యమైంది.
గతేగాది టీమిండియా తరుఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మయాంక్.. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన మూడు టీ20 మ్యాచ్‌లలో ఆడాడు. ఆ తరువాత వెన్నునొప్పి కారణంగా దేశీయ సీజన్‌కు దూరమయ్యాడు. బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందాడు. మయాంక్ రీఎంట్రీపై లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ సంతోషం వ్యక్తం చేశాడు. మాయాంక్ ఇప్పుడు పరుగెత్తడం.. బౌలింగ్ చేయడం ప్రారంభించాడని.. ఇది భారత క్రికెట్, ఐపీఎల్ రెండింటికీ చాలా మంచి విషయమని అన్నారు. NCA లో మయాంక్ బౌలింగ్ వీడియో చూశానని.. అతను 90 నుంచి 95 శాతం ఫిట్‌గా కనిపించాడని చెప్పారు.
ఈ సీజన్‌కు ముందు ఆటగాళ్ల గాయాలు లక్నో టీమ్‌ను బాగా దెబ్బ తీశాయి. మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, ఆకాశ్‌దీప్ ఇలా అందరూ మొదట్లో గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే శార్దుల్ ఠాకూర్‌ను టీమ్‌లోకి తీసుకుంది. ఆ తరువాత అవేష్ ఖాన్, ఆకాష్ దీప్ గాయాల నుంచి కోలుకుని జట్టులో చేరారు. తాజాగా మయాంక్ యాదవ్ చేరికతో లక్నో బౌలింగ్ విభాగం మరింత బలంగా మారనుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో మయాంక్ యాదవ్ తుది జట్టులో ఉండడం ఖాయమే. గత సీజన్‌లో స్థిరంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ.. వేగంగా వికెట్లు పడగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Also Read: Smita Sabharwal: చిక్కుల్లో స్మిత సబర్వాల్.. నోటీసులు జారీ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?
Also Read: Raj Tarun Lavanya: రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. లావణ్యపై తల్లిదండ్రుల దాడి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









