IPL 2025: ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ 7వ ఓటమిని మూటగట్టుకుంది. తాజాగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచులోనూ ఓడిపోయి..ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఇప్పటికే చెన్నై, రాజస్థాన్ ఔటయ్యాయి. అయితే ఈ రేసులో సన్ రైజర్స్ వెనకంజలో ఉన్నప్పటికీ ఆరెంజ్ ఆర్మీ జర్నీ ఇంకా క్లోజ్ అవ్వలేదు. ఇప్పటికీ టాప్ 4లోనే నిలించేందుకు సన్ రైజర్స్ కు ఛాన్స్ ఉంది. ఎలాగో చూద్దాం.
ఈ సీజన్ లో సన్ రైజర్స్ ఇప్పటి వరకు 10 మ్యాచులు ఆడింది. ఇందులో మూడు మ్యాచుల్లో నెగ్గింది. 7 మ్యాచులు ఓడిపోయింది. ప్రస్తుతం ఆరెంజ్ ఆర్మీ 6 పాయింట్లతో తొమ్మిదవ స్థానంలో కొనసాగుతోంది. దీంతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు చేరడం ఎలాగోనని అభిమానులు లెక్కలేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ హెచ్ టాప్ 4లో నిలిచేందుకు 8 నుంచి 10శాతం అవకాశం ఉంది.
సన్ రైజర్స్ ఈ సీజన్ లో ఇంకా 4 మ్యాచులు ఆడాల్సి ఉంది. టాప్ 4లో నిలవాలంటే ఇకపై అన్ని మ్యాచుల్లో కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంది. అప్పుడే 7 విజయాలు 14 పాయింట్లతో టాప్ 4 రేసులో ఉంటుంది. గతంలో చాలా సార్లు 14 పాయింట్లతో పలు జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాయి. ఈ లెక్కన ఈసారి సన్ రైజర్స్ కూడా ఆ విధంగానే టాప్ లో నిలిచే అవకాశం ఉంది. అయితే సన్ రైజర్స్ నెట్ రన్ రేట్ ఘోరంగా ఉంది. అందుకే హైదరాబాద్ కు భారీ విజయాలు అవసరం ఉన్నాయి.
Also Read: PF Balance Check: పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఇకపై చాలా తేలిక.. కేవలం ఒక మిస్ కాల్ ఇస్తే చాలు..
మూడు కంటే ఎక్కువ జట్లు 14కు మించి ఎక్కువ పాయింట్లను సంపాదించకూడదు. అప్పుడే సన్ రైజర్స్ 14 పాయింట్లతో టాప్ 4లో ఉంటుంది. ఇక్కడ నెట్ రన్ రేట్ అత్యంత కీలకం. రన్ రేట్ మెరుగ్గా లేనట్లయితే అసాధ్యం. ఈ లెక్కన హైదరాబాద్ ఇతర జట్ల ఫలితాలపైనా ఆధారపడాల్సింది. ముఖ్యంగా ముంబై, ఆర్సీబీ , గుజరాత్, పంజాబ్ తదుపరి మ్యాచ్ ల ఫలితాలు సన్ రైజర్స్ క్వాలిఫైయింగ్ అవకాశాలపై ప్రభావం చూపుతాయి. హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్ లు ఢిల్లీ, కోల్ కతా, ఆర్సీబీ, లఖ్ నవూ జట్లతో తలపడాల్సి ఉంటుంది. ఇందులో ఒక్క మ్యాచులో ఓడినా సన్ రైజర్స్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
గత ఏడాది ఆర్సీబీ ఒక్క శాతం అవకాశంను కూడా వదలకుండా పోరాడి టాప్ 4లోకి దూసుకువచ్చింది. ఈసారి అదే స్పూర్తితో సన్ రైజర్స్ పోరాడితే ప్లే బెర్త్ ఖాయం చేసుకోవడం పక్కా. అయితే ఈ ప్రెడిక్షన్ కాస్త కష్టంగానే ఉన్నా అసాధ్యమేమీ అవ్వదు. ఐపీఎల్ వంటి టోర్నీలో చివరి వరకు ఏదైనా జరగవచ్చు. అందుకే సన్ రైజర్స్ పట్టు వదలకుండా పోరాడాల్సి ఉంది.
Also Read: Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర, మే 3న శనివారం ఏకంగా రూ. 6000 తగ్గిన తులం పసిడి ధర.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









