SRH Play Off: ఐపీఎల్ 18వ సీజన్ 2025లో SRH తొలి మ్యాచ్‌ను ఘనంగా ప్రారంభించి అంచనాలను అమాంతం పెంచింది. ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్ లోనే ఐపీఎల్ లో రెండో అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఆ తర్వాతి మ్యాచుల్లో మాత్రం అదే జోరును కొనసాగించ లేకపోయింది. ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడిన SRH, కేవలం 2 మ్యాచులు మాత్రమే గెలిచింది.
పాయింట్ల పట్టికలోనూ చివరి రెండో స్థానంలో కొనసాగుతోంది. 10 కోట్లు పెట్టి షమీని కొనుగోలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. 11.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసినా ఇషాంత్ కిషన్, తొలి మ్యాచ్ మినహాయిస్తే వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. గత సీజన్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, SRH ఫైనల్ దాకా చేరుకుంది. కానీ ఈ సీజన్లో ప్లే ఆఫ్ దశకు చేరకుండానే సీజన్ నుంచి ఇంటిబాట పట్టే అవకాశాలు కనపడుతున్నాయి.
SRH టీమ్ లో బ్యాటింగ్ విభాగం బలంగా ఉన్నా..ఈ సీజన్లో ఆశించినంతగా రాణించలేకపోతున్నారు. బౌలింగ్ విషయానికి వస్తే ఈ సీజన్లో పూర్తిగా విఫలమయ్యారు. ఈసారి కప్పు సాధిస్తుందని ఆశించిన SRH ఫ్యాన్స్ కి మాత్రం తీవ్ర నిరాశే మిగులుతోంది.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









