Sunrisers Hyderabad: ఐపీఎల్‌లో తొలి విజయంతో పూర్తి ఉత్సాహంతో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు లక్నో సూపర్ జియాంట్స్ రూపంలో భారీ షాక్ తగిలింది. ఉప్పల్‌లో ఊచకోత ఉంటుందనుకుంటే ఆరెంజ్ ఆర్మీ ఉఫ్ అనిపించింది. అత్యంత ఉత్కంఠగా.. రసవత్తరంగా జరగాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పరుగులు రాబట్టడంలో.. బౌలింగ్‌లోనూ విఫలమవడంతో ఉప్పల్‌లో ఘోర ఓటమిని చవిచూసింది. లక్నో చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం పొందింది. ఈ సీజన్‌లో మరో భారీ స్కోర్ ఉంటుందని ఆశించగా.. ఘోర పరాభవం ఎదుర్కొంటుందని ఎవరూ ఊహించలేకపోయారు.
Also Read: GT vs PBKS Highlights: పంజాబ్ చేతిలో గుజరాత్‌కు పరాభవం.. శ్రేయస్ అయ్యర్ సెంచరీ మిస్
సన్‌రైజర్స్ హైదరాబాద్ విధించిన సాధారణ లక్ష్యాన్ని లక్నో సూపర్ జియాంట్స్ సునాయాసంగా చేధించింది. 16.1 ఓవర్లకు 193 పరుగులు చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఢిల్లీ చేతిలో ఎదురైన పరాభవాన్ని సన్‌రైజర్స్‌పై లక్నో తీర్చుకుంది. మిచెల్ మార్ష్ (52) అర్థ శతకం పూర్తి చేసుకోగా.. ఐడెన్ మార్‌క్రమ్ ఒక్క పరుగుకే ఔటవడం విస్తుగొలిపింది. నికోలస్ పూరన్ బ్యాట్‌తో రఫ్ఫాడించి 70 (6 ఫోర్లు, 6 సిక్సర్లు) పరుగులు చేయగా.. ఆయూశ్ బదౌనీ (6).. కెప్టెన్ రిషబ్ పంత్ (15), డేవిడ్ మిల్లర్ (13), అబ్దుల్ సమద్ (22) స్కోర్ చేసి విజయంలో భాగమయ్యారు.
Also Read: DC vs LSG: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. లక్నోను చావుదెబ్బ కొట్టిన అశుతోష్ శర్మ
బ్యాటర్లు నమోదు చేసిన స్కోర్‌ను సన్‌రైజర్స్ బౌలర్లు కాపాడలేకపోయారు. ఎక్కడా కూడా బౌలర్లు విజృంభించినట్టు కనిపించలేదు. ఫలితంగా మ్యాచ్‌ను లక్నోకు సమర్పించుకున్నారు. కెప్టెన్ కమిన్స్ రెండు వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా, షమీ తలా ఒక వికెట్ పడగొట్టారు.
సన్‌రైజర్స్‌కు పరుగులకు కళ్లెం
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (47) మినహా ఓపెనర్లు పూర్తిగా విఫలమయ్యారు. గత మ్యాచ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ ఘోరంగా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అభిషేక్ శర్మ (6), అభినవ్ వర్మ (2), షమీ (1) అతి తక్కువ పరుగులకే పరిమితమవగా.. అంకిత్‌వర్మ (36) దూకుడుగా ఆడగా.. నితీశ్ కుమార్ (32), క్లాసెన్(26) భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యారు. కెప్టెన్ కమిన్స్ (18), హర్షల్ పటేల్ (12*) కొన్ని పరుగులు జోడించి పరువు నిలబెట్టారు.
లక్నో అడ్డుకట్ట
మ్యాచ్ ఆరంభం నుంచి లక్నో బౌలర్లు సన్‌రైజర్స్ బ్యాటర్లను నియంత్రించారు. భారీ స్కోర్ చేయకుండా సన్‌రైజర్స్‌ను పకడ్బందీ వ్యూహంతో కట్టడి చేశారు. శార్దూల్ ఠాకూర్ బంతులతో విరుచుకుపడి కీలకమైన నాలుగు వికెట్లను పడగొట్టాడు. అవేశ్ ఖాన్, దిగ్వేష్ సింగ్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు. టాపార్డర్‌ను శార్దూల్ ఠాకూర్ కుప్పకూల్చాడు. ఆరంభంలోనే శార్దూల్‌తో వేయించడంతో ఆరెంజ్ ఆర్మీ భారీ స్కోర్ చేయలేక చతికిలపడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









