Saweety Boora Dowry Case: ప్రపంచ వేదికల్లో భారతదేశాన్ని గర్వించేలా చేసిన ఆమె.. రింగ్‌లో ప్రత్యర్థులపై పంచ్‌లతో విరుచుకుపడి విజేతగా నిలిచిన ఆమె.. ప్రత్యర్థులను ధైర్యంగా ఎదుర్కొని మెడల్స్‌ను మెరిసేలా వేసుకున్న ఆమె తాళిబొట్టు కట్టుకున్నందుకు అన్నింటా ఓడిపోతోంది. కలహాల కాపురం చేయలేక భర్తపై కేసు పెట్టింది. బాక్సింగ్‌లో పంచ్‌లతో విరుచుకుపడే ప్రపంచ ఛాంపియన్ ఇంటిపోరుకు వచ్చేసరికి ఓడిపోయింది. భర్త, అత్తామామల వేధింపులు తాళలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. దేశానికి ఎన్నో పతకాలు ఇచ్చిన ఆమె వరకట్న వేధింపులను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దేశాన్ని నివ్వెరపరుస్తున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Gorantla Madhav: తర్వాతి అరెస్ట్ గోరంట్ల మాధవ్..? పోలీసుల నోటీసు అందజేత!
ప్రపంఛ బాక్సింగ ఛాంపియన్, అర్జున పురస్కార గ్రహీత సవీటి బూరా తన భర్త కుటుంబసభ్యులపై కేసు నమోదు చేయించారు. అత్తింటివారు వరకట్నం తీసుకురావాలని వేధిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. భారత కబడ్డీ మాజీ ఆటగాడు, ఆసియా క్రీడల కాంస్య పతక విజేత, అర్జున అవార్డు గ్రహీత దీపక్ హుడా వేధించడం సంచలనం రేపుతోంది. భర్తతోపాటు అతడి కుటుంబం అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని సవిటీ బూరా హర్యానాలోని హిస్సార్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు దీపక్ హుడా కుటుంబంపై కేసు నమోదు చేశారు.
Also Read: AP Budget: రేపే రూ.3.25 లక్షల కోట్ల బడ్జెట్? ఏపీ ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు ఇవే?
డబ్బులతోపాటు దీపక్ ఒక ఫార్చునర్ కారు డిమాండ్ చేస్తున్నాడని భార్య సవిటీ బూరా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కొన్ని సార్లు తనపై దాడికి పాల్పడ్డారని సవిటీ వాపోయింది. సెక్షన్ 85 కింద దీపక్ హుడా, అతడి కుటుంబసభ్యులపై కేసు నమోు చేశారు. అయితే గతంలోనే సవిటీ పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణకు పిలిచారు. మూడు సార్లు నోటీసులు ఇచ్చినా దీపక్ నుంచి స్పందన లేదని పోలీసులు చెబుతున్నారు.
వివాహం..
క్రీడా రంగంలో రాణిస్తున్న వీరిద్దరూ 2022లో వివాహం చేసుకున్నారు. 2024లో జరిగిన హర్యానా ఎన్నికల్లో దీపక్ హుడా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు. రోహతక్ జిల్లా మెహమ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆ సమయంలో దీపక్ వెన్నంటే సవిటీ ఉంది. రాజకీయాల్లోకి వచ్చాక దీపక్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని.. సమాజంలో గౌరవంగా.. విలాసవంతంగా బతకాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









