)
Sunil Gavaskar on Rohit Sharma Virat Kohli: ఎన్నో అంచనాలతో ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత్‌కు తొలి మ్యాచ్‌లోనే అవమానకర ఓటమి ఎదురైంది. అయితే ఈ పరాజయం కంటే.. చాలా రోజుల తరువాత బరిలోకి దిగిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వైఫల్యం టీమిండియా ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. ఓ వైపు సెలెక్టర్లు, కోచ్ ఎప్పుడెప్పుడు టీమ్ నుంచి తీసేద్దామా అనే ప్లాన్‌లో రెడీగా ఉన్న తరుణంలో వీరిద్దరు తొలి మ్యాచ్‌లో విఫలమవ్వడం అభిమానులను బాధిస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఎలాగైనా ఆడాలని పట్టుదలతో ఉన్న రో-కో ద్వయం.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో అయినా దుమ్ములేపాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ సిరీస్‌లో విఫలం అయితే.. సెలెక్టర్లు ఏదో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. రోహిత్ శర్మ 8 పరుగులకే ఔటవ్వగా, విరాట్ కోహ్లీ డకౌట్ అయిన విషయం తెలిసిందే.
తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయంపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించారు. అడిలైడ్‌లో జరిగే రెండో వన్డేలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మళ్లీ బరిలోకి దిగుతారని.. స్పీడ్‌గా పరుగులు చేయడం అనేది వాళ్లకు టైమింగ్, ప్రాక్టీస్‌కు సంబంధించిన విషయం అన్నారు. ఆస్ట్రేలియాలో అత్యంత బౌన్సీ పిచ్‌పై ఆడుతున్నారని.. ఇది అంత సులభం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఆటగాళ్లకు మరింత ఇబ్బందిగా ఉంటుందన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ను క్రమం తప్పకుండా ఆడుతున్న శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్‌లకు ఇక్కడ సవాల్ ఎదురవుతుందన్నారు. భారత్ ఇప్పటికీ చాలా మంచి టీమ్ అని.. ఇదే జట్టు ఛాంపియన్ ట్రోఫీ విజేతగా నిలిచిందన్నారు. మిగిలిన రెండు మ్యాచ్‌లలో రోహిత్, కోహ్లీ భారీ స్కోరు చేస్తే ఆశ్చర్యపోకండంటూ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపారు.
"రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు కొద్ది రోజులకు దూరంగా ఉండి మళ్లీ ఎంట్రీ ఇస్తున్నారు. వాళ్లు నెట్స్‌లో ఎంత ఎక్కువసేపు గడిపితే.. క్రీజ్‌లో అంతసేపు ఆడతారు. వారు ఎంత ఎక్కువ త్రోడౌన్లు తీసుకుంటే.. తమ లయను తిరిగి వేగంగా అందుకుంటారు. నెట్ బౌలర్లను 22 గజాల నుంచి కాకుండా 20 గజాల నుంచి బౌలింగ్ చేయమని కోరితే.. మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక్కసారి వారిద్దరు పరుగులు చేయడం మొదలుపెడితే.. టీమిండియా స్కోరు 300 కంటే ఎక్కువగా ఉంటుంది.." అని చెప్పుకొచ్చారు ఈ లెజెండరీ క్రికెటర్.
వర్షం అంతరాయం కలిగించిన తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 26 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్ 21.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ మార్ష్ (46 నాటౌట్) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 0-1తో వెనుకబడి ఉంది. రెండో వన్డే ఈ నెల 23న గురువారం అడిలైడ్ వేదికగా జరగనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook