IPL 2025 SRH vs GT: సన్‌రైజర్స్‌ ఐపీఎల్‌ 2025 ట్రోఫీ చేజారినట్టే! గుజరాత్‌ చేతిలో భారీ ఓటమి

Gujarat Titans Outplay SRH By 7 Wickets: ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అత్యంత పేలవ జట్టుగా సన్‌రైజర్స్‌ ముద్రపడిపోయింది. ఏ జట్టుతో ఆడినా పరాభవం తప్ప విజయం ఎరుగనట్టు కనిపిస్తోంది. గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలోనూ పరాజయం ఎదుర్కోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 6, 2025, 11:49 PM IST
IPL 2025 SRH vs GT: సన్‌రైజర్స్‌ ఐపీఎల్‌ 2025 ట్రోఫీ చేజారినట్టే! గుజరాత్‌ చేతిలో భారీ ఓటమి

Gujarat Titans vs Sunrisers Hyderabad: ఐపీఎల్‌ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్‌ పాత్ర దయనీయంగా మారింది. ఏ చిన్న జట్టు అయినా కూడా సన్‌రైజర్స్‌పై సులువుగా గెలిచేయొచ్చు అనేలా రీతిలో ఆరెంజ్‌ ఆర్మీ చెడ్డ పేరు తెచ్చుకుంటోంది. ఐదో మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓడిపోయి నాలుగో ఓటమిని ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో తన చివరి స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన అతి తక్కువ సాధారణ స్కోర్‌ను కాపాడుకోలేక గుజరాత్‌కు మ్యాచ్‌ను అప్పగించింది. 7 వికెట్ల తేడాతో అత్యంత సులువుగా గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌ను వశం చేసుకుంది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేయగా.. గుజరాత్‌ టైటాన్స్‌ 3 వికెట్ల నష్టానికి 16.4 ఓవర్లలో లక్ష్యం చేధించింది.

Add Zee News as a Preferred Source

Also Read: PBKS vs RR Live: ఐపీఎల్‌ 2025లో పంజాబ్‌కు తొలి షాక్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌ భారీ విజయం

టాస్‌ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ తన సొంతగడ్డపై భారీ స్కోర్‌ చేయలేకపోవడం గమనార్హం. గతంలో అత్యంత భారీ స్కోర్లు నమోదు చేసిన స్టేడియంలోనే 152 పరుగులు నమోదు చేసింది. అది 8 వికెట్లు కోల్పోయి చేయడం ఇదే తొలిసారి కావొచ్చు. ఈసారి టాపార్డర్లు చేతులెత్తేయకుండా అతి తక్కువ పరుగులు సాధించారు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి చేసిన 31 పరుగులు అత్యధిక స్కోర్‌ కావడం విశేషం. అభిషేక్‌ శర్మ (18), ట్రావిస్ హెడ్‌ (8), ఇషాన్‌ కిషన్‌ (17), హెన్రిచ్‌ క్లాసెన్‌ (27), అనికేత్‌ వర్మ (18), పాట్‌ కమిన్స్‌ (22*), షమీ (6) ఇలా పరుగులు చేశారు. గుజరాత్‌ బౌలింగ్‌ అద్భుతంగా వేసింది. మరోసారి మహ్మద్‌ సిరాజ్‌ బంతితో దుమ్మురేపాడు. నాలుగు వికెట్లు తీసి సన్‌రైజర్స్‌ బ్యాటర్లను వెంటవెంటనే మైదానం నుంచి సిరాజ్‌ మియా పంపించి వేశాడు. ప్రసిధ్‌ కృష్‌ణ, సాయి కిశోర్‌ తలా రెండు వికెట్లు తీశారు.

Also Read: CSK vs DC: ఐపీఎల్‌లో సంచలనం.. ఢిల్లీ హ్యాట్రిక్‌ విజయం.. చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి

సన్‌రైజర్స్‌ విధించిన తక్కువ లక్ష్యాన్ని గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్లు సునాయాసంగా చేధించారు. 16.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. జోస్‌ బట్లర్‌ డకౌట్‌ కాగా.. సాయి సుదర్శన్‌ ఐదు పరుగులకే పరిమితమైన వేళ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ రెచ్చిపోయి ఆడాడు. 43 బంతుల్లో 61 పరుగులు చేసి మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడాడు. మొత్తం 9 ఫోర్లు బాదాడు. గిల్‌కు జత కట్టిన వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుత ప్రదర్శన చేసి అర్థ శతకానికి ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. రూథర్‌ ఫోర్డ్‌ (35) పరుగులతో రాణించడంతో టైటాన్స్‌ విజయం సాధించింది. బ్యాటర్లు చేసిన తక్కువ స్కోర్‌ను సన్‌రైజర్స్‌ బౌలర్లు కాపాడలేకపోగా.. మ్యాచ్‌ను ముందే అప్పగించేశారు. సీనియర్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ 2 వికెట్లతో పర్వాలేదనిపించగా.. పాట్‌ కమిన్స్‌ ఒక వికెట్‌ తీశారు. మిగతా బౌలర్లు వేశామంటే వేశామన్నట్టు వారి ప్రదర్శన ఉంది. బ్యాటర్లు.. బౌలర్లు విఫలమవడంతో నాలుగో మ్యాచ్‌ను కూడా ఇచ్చేసుకుని పాయింట్ల పట్టికలో చివరి స్థానాన్ని సన్‌రైజర్స్‌ సభ్యులు పదిలం చేసుకున్నారు.

అత్యంత ఘోరం
తొలి మ్యాచ్‌లో అద్భుతంగా ఆడినా జట్టు ఇది అని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుపై సందేహాలు వస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్ చేయడమే కాకుండా ఆ మ్యాచ్‌ను గెలవడంతో ఈసారి కూడా మళ్లీ ఆరెంజ్‌ ఆర్మీ ఫైనల్‌ దాకా వెళ్తుందని అందరూ ఊహించారు. ప్రత్యర్థి జట్లు కూడా బెంబేలెత్తిపోయాయి. అనంతరం ఏం జరిగిందో ఏమిటో తెలియదు కానీ అనంతరం జరిగిన ప్రతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓడిపోతుంది. జట్టుతో సంబంధం లేకుండా ఆడిన ప్రతి మ్యాచ్‌ ఓడిపోవడం సన్‌రైజర్స్‌ అభిమానులకే కాదు ప్రతి క్రికెట్‌ అభిమానికి విస్తుగొలుపుతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌తోపాటు అన్నింట్లో సమష్టి వైఫల్యంతో వరుస మ్యాచ్‌లు కోల్పోతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌ సెమీస్‌కు వెళ్లే అవకాశాలు దాదాపుగా కష్టంగా కనిపిస్తోంది. రానున్న మ్యాచ్‌ల్లో దాదాపుగా అన్ని గెలిస్తే తప్ప అవకాశం లేదు. మరి తదుపరి మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో వేచి చూడాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News