)
SRH vs LSG: ఐపీఎల్ లో 300 అందుకునే సత్తా ఉన్న జట్లలో మొదటగా వినిపించే సన్ రైజర్స్ హైదరాబాద్ పేరే. రాజస్థాన్ రాయల్స్ తో మొదటగి మ్యాచ్ తర్వాత ఈ సీజన్ లో ఆ జట్టు త్రిశతకం అందుకోవడం ఖాయమనే అంచనాలు భారీగా పెరిగాయి. ఆ ప్రత్యర్థి ఎవరన్నదే తేలాలి. గురువారం లఖ్ నవూ సూపర్ జెయింట్స్ తో సన్ రైజర్స్ అమీతుమీ తేల్చుకుంటుంది. ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచులో ఇరగదీసిన హైదరాబాద్ కు వరుసగా రెండో విజయం అనేది పెద్ద కష్టం కాకపోవచ్చు. ఊహించిన విధంగానే మొదటి మ్యాచులోనే ఆ జట్టు బ్యాటింగ్ తో విశ్వరూపం చూపించేసింది. అభిషేక్ వర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెస్ ల దూకుడోత ఐపీఎల్ లో అత్యధిక పరుగుల రికార్డుకు సర్ రైజర్స్ ఒక్క పరుగు దూరంలోనే నిలిచింది.
క్రీజులోకి వచ్చి ప్రతి ఒక్కరూ బ్యాటింగ్ తో దంచుడే దుంచుడు మొదలుపెట్టారు. దీంతో 286 పరుగుల భారీ స్కోరుతో హోరెత్తించింది. ఈ సీజన్ లో ఇప్పటికే ఆగ్రస్థానంలో నిలిచింది హైదరాబాద్ జట్టు. ఈ జట్టు బ్యాటింగ్ లైనప్ లక్నో బౌలర్లకు పెద్ద సవాలుగా మారనుంది.
లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది. మిచెల్, నికోలస్ అద్బుతంగా ఆడినప్పటికీ ఆశుతోష్ వర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో లక్నోకు విజయాన్ని చేజార్చాడు. రిషభ్ పంత్ నాయకత్వంలోని ఈ జట్టు ఈ ఓటమి నుంచి తేరుకుని హైదరాబాద్ పై పోరాడేందుకు రెడీ అవుతోంది. గాయం నుంచి కోలుకుకన్న ఆవేశ్ ఖాన్ జట్టులోకి తిరిగి వచ్చినప్పటికీ అతన్ని నేరుగా ఆడిస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక ఉప్పల్ పిచ్ బ్యాట్స్ మెన్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. గత మ్యాచులో హైదరాబాద్ ఇక్కడ భారీ స్కోరు నమోదు చేసింది. ఈ సారి కూడా హై స్కోరింగ్ గేమ్ ను మనం ఆశించవచ్చు. ఈ మ్యాచులో హైదరాబాద్ ఆధిపత్యాన్ని కొనసాగించాలని లక్నో తమ తొలి విజయాన్ని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకన్నాయి. ఈ రెండు జట్ల మధ్య గతంలో జరిగిన మ్యాచులో హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ పరిస్థితుల్లో లక్నో ఈసారి ప్రతికారం తీర్చుకుంటుందా లేదా హైదరాబాద్ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా అనేది మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తానికి నేటి మ్యాచ్ ను ఎంజాయ్ చేసేందుకు ఫ్యాన్స్ మాత్రం రెడీగా ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి