IPL 2025 SRH vs LSG: ఐపీఎల్ 2025 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ రెండు మ్యాచులో లక్నో సూపర్ జెయింట్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంది. మార్చి 27వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో హైదరాబాద్ అభిమానులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలు అయ్యాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నారు. హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేసింది.
హైదరాబాద్ బ్యాటింగ్ ఆరంభంలోనే ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడాడు. 47 పరుగులు చేశాడు. షార్థూల్ ఠాకూర్ వేసిన వరుస దెబ్బలతో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ త్వరగా ఔట్ అయ్యారు. హెన్రిచ్ క్లాసెస్, నితిష్ కుమార్ రెడ్డి లు కొంత వరకు ఆదుకున్నప్పటికీ..లక్నో బౌలర్లు, ముఖ్యంగా షార్ధూల్ ఠాకూర్ వారిని కట్టడి చేశారు. చివరిలో అనికేత్ వర్మ వేడిగా ఆడి స్కోరును 190కి తీసుకువచ్చాడు. కానీ ఇది లక్నోను ఆపేందుకు సరిపోలేదు.
Also Read: Gold Rate Today: పండగ ముందు గుడ్ న్యూస్...భారీగా పడిపోయిన బంగారం ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నికోలస్ పూరన్ 26 బంతుల్లో 70 పరుగులు, మిచెల్ మార్ష్ 31 బంతుల్లో 52 పరుగులు చేశారు. కేవలం 16.1 ఓవర్లోనే విజయాన్ని అందుకుంది లక్నో. పూరన్ 6 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగిపోయాడు. మార్ష్ కూడా బాగా రాణించాడు. చివరిలో అబ్దుల్ సమద్ కూడా బాగానే రాణించాడు. హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు తీసినా లక్నోను కట్టడి చేయలేకపోయాడు.
కాగా ఈ ఓటమితో హైదరాబాద్ ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. ఏకంగా 300 పరుగుల టార్గెట్ పెట్టుకున్నారు. కానీ హైదరాబాద్ జట్టు 200కూడా చేయకపోవడంతో అభిమానుల్లో నిరాశ కనిపించింది. ఈ జట్టుపై హైప్ ఎక్కువైపోవడం కూడా సమస్యగా మారిందనే చెప్పవచ్చు. అంతకుముందు మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ పై 286 స్కోర్ చేసిన హైదరాబాద్ అదే జోరును ఇక్కడ కొనసాగించలేదు. లక్నో బౌలర్లు, ముఖ్యంగా షార్థూల్ ఠాకూర్,ప్రిన్స్ యాదవ్ లు హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ ను చాందిని చేశారు. ఈ విజయంతో లక్నో తమ తొలి పాయింట్లను సాధించగా..హైదరాబాద్ 6వ స్థానానికి పడిపోయింది. ఇక ఫ్యాన్స్ మాత్రం తమ జట్టు మరింత కసితో ఆడాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ జట్టు గురించి పోస్టులు చేస్తున్నారు.
Also Read: Royal Enfield Classic 650: కుర్రాలకి కిక్కే కిక్కూ.. రాయల్ ఎన్ఫీల్డ్ న్యూ బైక్ లాంచ్.. ఫీచర్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









