)
India vs Pakistan: సెప్టెంబర్ 14న జరగనున్న భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చుట్టూ పెద్ద వివాదం రేగింది. ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ మ్యాచ్ జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమని, అమరవీరుల త్యాగాలను అవమాన పరుస్తుందంటూ పిటిషనర్లు పేర్కొన్నారు. ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో భాగంగా జరగబోయే ఈ మ్యాచుపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కోర్టు జోక్యం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
లైవ్ లా సమాచారం ప్రకారం... నలుగురు న్యాయ విద్యార్థులు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనలను ప్రస్తావిస్తూ.. పాకిస్తాన్‌తో క్రీడలు ఆడటం అమరవీరుల కుటుంబాలకు అవమానమని వాదించారు. మన సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేస్తుంటే, అదే సమయంలో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశంతో క్రికెట్ ఆడటం తప్పు అని పేర్కొన్నారు. ఇది తప్పుడు సందేశాన్ని ఇస్తుంది అని పిటిషనర్లు అభిప్రాయపడ్డారు. వినోదం కన్నా దేశ గౌరవం, పౌరుల భద్రత ముందు వరుసలో ఉండాలని వారు స్పష్టం చేశారు.
పిటిషనర్లు ఈ కేసులో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI)ను కూడా ఒక పార్టీగా చేర్చారు. అంతేకాదు, బీసీసీఐని యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకురావాల్సిన సమయం వచ్చిందని వారు పేర్కొన్నారు. జాతీయ క్రీడా పరిపాలన చట్టం 2025 అమల్లోకి వస్తే బీసీసీఐ కూడా ఆ చట్టం కింద ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా బోర్డు పరిధిలోకి వస్తుందని పిటిషన్లో వివరించారు.
ఈ పిటిషన్ AoR (అడ్వకేట్ ఆన్ రికార్డ్) అన్సార్ అహ్మద్ చౌదరి ద్వారా దాఖలు చేశారు. దీనికి ఊర్వశి జైన్ , ఇతరులు vs యూనియన్ ఆఫ్ ఇండియా, ఇతరులు అనే పేరు పెట్టారు. పిటిషనర్లు యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖను జాతీయ క్రీడా పరిపాలన చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని, సీజన్ బాల్ క్రికెట్‌ను జాతీయ క్రీడా సమాఖ్య పరిధిలోకి తీసుకురావాలని కూడా డిమాండ్ చేశారు.
ఈ పరిణామాలతో భారత్-పాక్ మ్యాచ్ జరగడం కష్టమనే చెప్పాలి. సుప్రీంకోర్టు ఈ పిల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. దేశంలో అమరవీరుల గౌరవం, ప్రజల మనోభావాలు, క్రికెట్ వినోదం, ఈ మూడు అంశాల మధ్య సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.